Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాశానికి మోకీసి ఎక్కేస్తాడు
ఆయువుపట్టు కాళ్ళ బంధంతో పెట్టేస్తాడు,
ఆశతో ఆకాశంలోని పాలదారను చూస్తాడు
బ్రతుకుపై ఆశతో ఆసాంతం
తాటిచెట్టును బాదేస్తాడు ..
నోదిటీ మీద దారిద్రపు రేకలు
తాటిచెట్ట మీద తాటి ఆకులు,
చీకటి జీవితంలో తెల్లటి అమత ధార
ఆకాశం నుంచి జాలు వారిన జీవన ధార...
ప్రాణం అంటే లెక్కచేయడు
తాటి చెట్టు ను వదిలేయ డు
మా గౌడన్న కడుపు మంట లోతు ముందు
ఆ చెట్టు లోతు ఏమి ఎక్కువకాదు..
పేదవాడికి అమతధార
అమూల్యమైన వనం నుంచి కారిన
బ్రతుకు పాల ధార.
గౌడకులస్తుల గుండెకాయ ఆ మోకుతాడు.
అత్మ బందువై అన్ని బాధలు తీర్చే
నల్లటి నిలువెత్తు మిత్రుడు..
మా తాటిచెట్టు..
- కొండల్ పులి,
9866537341