Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''బాధల నుండి.. తప్పుకోవడం.. లౌక్యం''..
మరి బాధ్యతలను విస్మరించడం 'నేరం'..
మన 'మానస ప్రపంచంలో,'
'మెరపు' ఆలోచనతో...
'ఉరుము' ఆచరణతో...
హర్ష వర్షంతో... 'కరోనాను' 'తుడిచిపెట్టి'
'మానవాళికి' ఆరోగ్యం పండించాలి...
'మనోబలం'తో...
కరోనా 'భీభత్స' 'ఆహాకారాలే'..
''ఆ...హా'' స్వరాలుగా మారాలి...
'కరోనామహమ్మారి' శతబ్దానికొకమారు
'పిలువకనే' వచ్చి... ప్రాణాల్ని హరిస్తుంటె...!!
ఆ 'వైరస్'ను... 'మనోబల వజ్రాయుధంతో'
వధించాలి.. 'మానవాళివ్యధ'ల తొలగించాలి..
''మన అక్షర ఇంజెక్షన్లతో''...
''సూదుల్లా కప్పుకొన్న'' ఆ ''సూక్ష్మ వైరస్''ను
''సర్జికల్ స్ట్రైక్'' చేయాలి.. 'మనోధ్కెర్యం
సడలక,' 'నిబంధనలు వదలక'...
''ఫ్రంట్ వారియిర్లా''... ఆ కోవిడ్-19ను
'ఎన్కౌంటర్' చేయాలి...
మిన్నంటిన 'జనావళి''.. 'నిరాశా,నిసహ'లకు..
'స్పేస్‌షిప్'గా మారి, 'మనోసంకల్ప
సాటిల్కెట్' తో.. 'భరోసా' సంకేతాలివ్వాలి..
'మనలో మనోబలం'... అనంత విధాలు..
అందుకు... సందేహమే, లేదు...
'పొరుగువాడికి, కరోనా సోకితే మన ఆపన్న హస్తాలే,' 'మనోబల నేస్తాలు''గా మారాలి...
'కదిలే బాధల బారులు''... 'వలస కూలీలకు' చేయూత నిచ్చేదే... 'మనోబల'.. మరోరూపం, మహత్తర శక్తి స్వరూపం...
'ఎదురయ్యే, సంక్లిష్ట పరిస్థితుల'..
'ఎదుర్కొనేదే'... మనోబలం...
''అద్భుత మనోబలాన్ని''...
''మనం ఆవిష్కరించాలి''...
''కరోనా తిరోగమనాన్ని'' సాధించాలి...
- డాక్టర్ చింతల శ్రీనివాస్
9550220856