Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇక్కడ
పిలిచేది ఇసుక ఎడారి బాట
విశాల ఆట మైదాన పాటగా
బాల్యం విశ్వాస శ్వాస పూలతోటై
అమూల్య స్నేహాల ఊపిరి ఊదింది
పెనవేసుకున్నవి కలిమి లేములన్నీ
ఎదిగాయి చెట్టు నీడన చేతులుగా
చెలిమె తోడే చెలిమి చేతులు
బిందెల నీళ్ళు దాహాన్ని తీర్చాయి
మేఘం కురిసిన ఆకాశపు వానలా
అక్షరాల ఒడిలో విచ్చిన పుష్పాలు
కలిపింది మట్టి వాసన మనిషిని
పలకా బలపం రాసిన మానవత్వమై
అడుగుల పరుగులు వడిగా తిరిగే
హదయపు లయలో
తడి పెరిగే వసంతమైన
జీవన వీణలు మోగే తీగల రాగమై
ఆలింగనంలో ఊరంతా వెన్నెల
గట్టిపడ్డ వేళ్ళు కరచాలనం కన్నుల
అది నా సొంత ఊరు చిరునామా
నా సొంత ఊరు జనం సంతకం
కలిస్తే జాతరలో బత్తీసాల తీపి
ఒంటరితనం మచ్చుకైనా కనపడలే
సమూహబంధం సమాజ ప్రాణాలై
ఇప్పడా తీపి గుర్తులున్నయా బతికి
ఊరు మాయమైన చెరువు దూరమే
భార భారంగా ఊపిరి మట్టిలో
పుట్టుక మట్టి పొత్తళ్ళలో
బతుకు మట్టి నాగళ్ళతో
గిట్టిన వేళ మట్టి పొరల వాకిళ్ళలో
మట్టితో రక్తం ఆట ఆడే
పొలిమేరల్లో
మసక మనిషి నీడ పాటైంది
- డా.టి.రాధాకష్ణమాచార్యులు
9849305871