Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఇంత విస్తారమైన ప్రేమని
ఇంత ఆత్మికంగా
ఈ ప్రపంచానికి
ఎలా ఇవ్వగలుగుతున్నావని'
అడుగుతారు లోకులు.
'తేనె కోసం వెతికే తేనెటీగల
మకరందంలో తీయదనం వుంటుంది.
నీలో వున్న ఆ మాధుర్యం
నీ మనసును గుచ్చి
వేధించే ప్రతి వగపునూ
వలపుగా మార్చడానికే చూస్తుంది.
నీలోని వేదన నిన్ను
క్రూరంగా మలచనీయకు.
ఆ వ్యధ చెదిరిపోయాక
నీ జీవుడిలో నిండి
నిన్ను అన్నింటిని ఎదుర్కొని నిలబడే
ధఢత్వానికి ప్రతీకగా నిలబెట్టే
ఆ మధురామతంగా మారిపో '
అని నేనన్నాను.
- నజ్వ జెబియన్,
లెబనీస్ కెనడియన్ కవయిత్రి (జ.1990)
- అనువాదం : పి.శ్రీనివాస్ గౌడ్