Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అను నిత్యం నేను
పద్యాన్ని మోసుక తిరిగే వాణ్ణి
ఎప్పుడూ ఎద తలుపులు తట్టే వాణ్ణి
కాల్చుక తింటున్న ఈ ఏకాకి తనం
కోల్పోయిన స్వేచ్ఛ ను గుర్తు చేస్తున్నది!
మరణాలు నిశ్శబ్దంగా
విసిరేస్తున్న దుఃఖం
తెరలు తెరలుగా
చీకటి పరదాలను విసిరేస్తున్నది!
స్వప్నాలన్నీ
నల్ల రంగు పులుముకుని
నిద్రలోనూ మెలుకువలోనూ
భయకంపితున్ని చేస్తున్నాయి!
దారెంటా వలస బ్రతుకుల
ఎండిన రక్తసిక్త పాద ముద్రలు
ఈ చీకటి చరిత్రను
పద్యం చేయమని వెంటాడి వేధిస్తున్నాయి!
వైద్యం అందని ద్రాక్షై
చేదెక్కిన బ్రతుకులు
అనుక్షణం కలవర పెడుతున్నాయి
ఎన్ని సార్లు కళ్ళు నులుముకుని చూసినా
తోటంతా పూలు రాలిన దశ్యాలే!
ఋతువులు మారుతున్న కద్దీ
తరగని విశ్వాసమొక్కటే
ఆకు పచ్చని లోయను కలగంటున్నది!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి
సెల్: 9440233261