Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాడూ నేనూ
పక్క పక్కనే నడుస్తున్నాము
నా నీడ నా వెంటే వస్తోంది
వాని నీడ మాత్రం కనిపించట్లేదు...
వాడు నిన్నే తల్లిని వద్ధాశ్రమంలో చేర్పించాడు
మొన్న జరిగిన చెల్లి పెళ్లికీ రాలేదు
ఆస్తుల పంపకంపై తమ్మునితో
వ్యాజ్యం ఏదో నడుస్తున్నట్టూ వుంది...
వీధిలో అందరినీ గమనించసాగాను
ఎవరి నీడలోనూ చిక్కదనం లేదు
అంతా రంగు వెలసిన నీడలే
నా నీడతో సహా
మా తాత నీడలోని చిక్కదనం
నా నీడలో లేదెందుకనో...
నీలోని
మంచితనం మనిషితనం
నీ నీడై కనిపిస్తుందని
మా నాన్న చెప్పిన జ్ఞాపకం...
వీలైతే
మీరూ నీడల్ని గమనించండి
చిక్కనైన నీడ కనిపిస్తే
ఆ మనిషికి సలామ్ చేయండి...
- అశోక్ గుంటుక
సెల్: 9908144099