Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాయిదా మాట ఎత్తడం అంటేనే
కండ్ల లోని దుఃఖం
అరచేతిలో సంద్రమై వాళ్ళను
అలల ఆయుధాలతో భయ పెట్టడం
కాళ్ళలోని మహాప్రస్థానోత్చవం
ఎండు చేపలై చీకటి బుట్టలో దాగుండడం
వేటవల వాయిదా వేసిన చావును
కాళ్ళు చేతుల్ని నీటితాళ్లతో కట్టేసి
నత్య పోటీలు ప్రకటించడం
వాయిదా వేయడమంటే
తెగిపోయిన తాడు పురులను అతికించనీకో
మండుతున్న పుండును
మలాంతో నయం చేయనీకో
ఎగిసి పడుతున్న కెరటాల్ని
ఒడ్డున నాటనీకో కాదు
రాలి పోతున్న పువ్వు
రంగులరెక్కలతో కొమ్మను
కొంచెం హత్తుక్నొకోె కాదు
అనంతుని దయగల పులి ఆవుకు వేసిన
వాయిదా లాంటిది కాదిది
ఈ వాయిదా
చావును మాత్రమే ఈడ్చుకెళ్లేది కాదు
వాళ్ళు వాయిదా మాట విని
చావు కంటే ఎన్నో రేట్లు చస్తున్నలు
అందుకే వాళ్ళు
వాయిదాను వాయిదా వ్య్నెమంటున్నలు
ఎందుకంటే
అది ఒకసారి ముడుచుకొని పండుకుంటే
వెయిల నల్ల త్రాచు పడగల్ని
సిద్ధం చేసు కుంటుంది కాబట్టి.
- డా. ఉదారి నారాయణ
9441413666