Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూమి నరాల్లో ప్రవహించే కలల కాల్వలు
సెమటనాగలిని అంటుకట్టుకొన్న ప్రాణ నదైన పారుకానివి
కాస్తోవుతున్న నీ మడిదొప్పల కిందనే నోరుతెర్సి
నాసుపెట్టుకోని నక్కిన అప్పుల జిట్టపులిని
ఎట్లా?మట్టుపెట్టగలవు! ధ్వంసమైన జీవితంతో
గాయాలెన్నుంటెంది?
అలుకు బొనంమీది దీపం కాడై వెలగడమే వర్తమానమంటావు
ఆయేటి పూనిన వర్షం కురువచ్చు! కురువకను పోవచ్చని!
ఇచ్చాంత్రాల లోకం హిమ్మత్ ఇవ్వొచ్చు! ఇవ్వకను పోవచ్చని!
మర్మం తెలవని రాజ్యం మాటమీద
నిలబడక పోవచ్చని ఎవరు చెప్పగలరు?
మనసుతెట్టేబాయిల దుక్కం ఊట బుంగై ఉబికి
రెండు నయనాలు మోట బొక్కెనలై కన్నీటిని ఎగతోడుతున్నై
ఎండిన డొక్కలను పాడేకు ఎలాగట్టి
ఎలనంపుకుంటుంది వూరు
కాలం గుండె గొంతుక మూగబోయి
మట్టికి ఆలింగనమైన ఆరుద్ర పురుగువు
బాగా పండి ఎండిన నకిరికె పండు తీపి గూగమువు
నీ పాదాలు మోపినంతనే
నాగరికత నాలుగు దిక్కుల
పచ్చగోలిచ్చుకుంట ఫక్కున ప్రజ్వరిల్లుతది
ఎవరు ? నేర్పారు నీకు!
ఆనెలుకట్టిన నేలనొసటన కుంకుమ దిద్దడం
తడిపొలం సెక్కల పచ్చని పైరువై ఏన్కోవడం
ఎవరు? నిలబెట్టారు నిన్ను!
వరిగొల్కవై బాధలమొకం మీద బాసింగమై నవ్వటం
పచ్చి బాలింత ఈ నేల ప్రాణశారం పడైనసరే
నాగేటి పాలేపట్టి కుంకుమ కుంకుమ
కుదుర దున్నిన దుక్కిల పొట్టకొచ్చిన పంటవు
అప్పుల వరదగూడులో చిక్కుకున్న
వొడుపుగా శ్రమను వొడినింపుకొనీ
అల్గంల వన్నెలాడే ధాన్యం రాశుల మీద
ఆస్మానంతా తలెత్తుకు నిలబడ్డ ఐశత్వు
- డాక్టర్ పొన్నాల బాలయ్య
9908906248