Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిత్వాన్ని ప్రేమించే గుణం
హృదయ లయ జీవ లక్షణం
మరైతే కవిత్వ కలాలను
అభినందించకుండా ఎలా ఉంటాం
మౌనాన్ని పలికించే పనిలో ఉంది
కలం
ప్రయోగాలెన్నో చేసింది
కాలంలో
విస్ఫులింగం విస్ఫోటనం భావస్ఫూర్తి
మౌనంలో ఉన్న ధైర్యం స్వేదమే
మౌనం మాట్లాడింది నాలో లోన
ఆకలి తీరంలో కడలి నిశ్శబ్దమై
జాలిగుండెల్లో శబ్దించింది మౌనం
ఒక్క మౌనం
నిజంగానే మహా కావ్యం
బహుశా ధ్యానమౌని ఆమని తరంగిణిగా
భావాంతరంగ తడి స్పర్శ కావొచ్చు
మానవ సమస్యల రాపిడి అవొచ్చు
పద్మవ్యూహాల ఛేదనే మనసు మౌనం
బహుళార్ధకం ఒకే ఒక పదం
బద్దలైనప్పుడు నేల ముద్దాడే
ఒక ఆర్తినీ ఒక బాధనూ
ఎన్నో కష్టాలూ కన్నీళ్ల ఎడారులను
మౌనం మాట్లాడింది కనుల దశ్య ధునిలో
ధారాపాత వర్ష ధ్వని రుధిర సౌదామినిగా
ఆశలు చిగురించే అడవిలో
మౌనం మహార్ణవం
రంగుల ఆటలో ధవళ వర్ణం చూడు
శబ్దార్ధ చంద్రిక శీతల జ్వాల దష్టిలో
మౌనం మాటే విశాల అంబరం
మనసు పాడుకునే ప్రేమలో
పల్లవించే చరవాణి మౌనం
మెత్తని సడిలో వాణీ రాగం
మౌన గాంభీర్యం మది
సుందర సౌందర్య నదీ ప్రవాహం
మనసుకూ మనసుకు నడుమ
ప్రసరించే విద్యుత్తరంగ శక్తి యుక్తి
మనసు గెలిచే కవితా గానం మౌనం
మాటలేని మనిషి దివ్యాస్త్రంలా
మౌనం మాట్లాడింది నాలోన
- డా.టి.రాధాకష్ణమాచార్యులు
9849305871