Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గొంతు తడి ఆరిపోతుంది
అక్షరాలు తడపడుతున్నాయి
చీకటిని చీల్చుకొని వచ్చిన
సూర్యునికి
ఆనాడు సుప్రభాత సేవలు
నేడు బరువెక్కిన హది తో
నగర వీధులోనుండి
శోక నాధాలు
కన్నీరు ఏరులై పారుతున్నాయి
ఎన్నటికో అవి ఆవిరి అయి ఇంకెరు
సై అన్న గుండె సతమతమవుతుంది
కూటి కోసం కొలువుకు పోతే
కరోన మహమ్మారి అంటే
ఆసుపత్రిని అనుసరిస్తే
ఆస్తులు ఆవిరై పాయే
అప్పులు కుప్పలై పెరిగే
ఊపిరి దేహం వదిలే
ఆప్తులంతా అంటూ రోగం అని
అల్లంత దూరాన ఉంటే
కన్నా తల్లి కన్నుమూసిన ఘటనకు
చిన్నారి బిక్కు బిక్కున చూసే...
ఈ మహమ్మారి మమత ఎరుగదే
ఆ తల్లిని చిన్నారికి ఇవ్వదే....
మరో వీధి ........
రంగుల ఇంద్రదనస్సు విరిగెను
రంగులు అద్దె
నేతన్న (భార్యాభర్తలు ఇరువురు)
నేల తల్లి ఒడి చేరాను
గాలిలో ఉయ్యాలో
గాలిలో కలిపెను
నా ఆకర్షణ శక్తి కి విలువ ఏడ
నా బిడ్డలను కాపాడలేకున్న
అని భూదేవి బోరున ఏడ్చెను
నింగి, నీరు, నిప్పు, గాలి, భూమి
కన్నీరు పెట్టెను
నగరం వీధిలోని
ఆర్థనాదాలు వినలేక
ఆ పసి హదయాల బాధ
అవి భరించలేక......
నేను చూడని వీధులెన్నో
కానీ ప్రతి వీధి కథ ఇదే.......
- కూన. సుమన చక్రవర్తి