Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలియక అడుగుతున్నాను -
సమాధానమిచ్చావు, కానీ, రాతి పగుళ్ళలోకి
ఇంకిన నీటి బిందువులైనట్లు
వాటిని అందుకోలేక పోయాను!
ఈ రాత్రి - వెన్నెల స్పర్శ చల్లగానే వుంది
శీతల గాలులే వీస్తున్నాయి
కొండ శిఖరం పై కురుస్తున్న మంచు
బహుశా చల్లగానే వుండి ఉంటుంది !
దారి నిండా చెట్లు రాల్చిన ఆకుల గలగలల శబ్దాలు
వినసొంపుగానే వుండి
మనసుకు తడి తడిగానే తాకుతు చల్లటి
అనుభూతినిస్తున్నాయి !
ఐనా తెలియక అడుగుతున్నాను?
ప్రశ్న ఒక్కటే అంత వేడిగా, మంటనెందుకు పుట్టిస్తుందో !?
- డా. రూప్‌కుమార్ డబ్బీకార్
99088 40186