Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయన అలుపెరగని అక్షర ప్రేమికుడు. నిరంతర రచనా శ్రామికుడు. వీరి అక్షరాలు తిరుగు లేని అస్త్రాలు. సామాజిక చైతన్యానికి వారధులు. కవి వట్టి మనిషి కాదు మట్టి, ఆకాశం కూడా అంటూ కవిత్వపాఠాల సారాన్ని జుర్రుకుని బలమైన కవితా భీముళ్ళను వదిలి పెడతాడు.. సమాజంలో చైతన్యం తుడవడానికి. అందుకే అతని కవిత్వం గంగా ప్రవాహంలా పవిత్రతను సంతరించుకుంది.
60 కవితానదులన్నీ సువిశాల సముద్రంలో కలిసినట్లు తొణకని వాక్యమై నిలిచాయి.
దుప్పల్లిలో వీరు కళాసాహితీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టి నదురు బెదురు లేకుండా తొణకని భావాలు బరువును అవలీలగా భుజాలకెత్తుకొని సాహితీ దుక్కి దున్నేస్తున్నారు.
కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా మనం నిత్యం వాడుతూ ఉన్నా మనదష్టి సోకని డోర్మేట్ను తన కవితా రసహదయంతో స్ప్రుసించారు. నేను ఉద్వేగానికి గురి అయినప్పుడల్లా దీన్ని స్వచ్ఛ భారత్ అంబాసిడర్ చేయాలనిపిస్తుంది అంటూ రాశారు.
గుండె కింద తడితో మొదలైన వీరి సాహితీ ప్రయాణం రహస్యాలు లేని వాళ్ళు, రంగు వెలసిన జెండా, నూరు తెలంగాణ నానీలు, నిషేదానంతర నానీలు, అంతర్వాహిని, నాన్నా! నాలా ఎదుగు, గడప దాటని యుద్ధం, బ్రేకింగ్ వ్యూస్, తణకని వాక్యం ,హరిత స్వప్నం, మనుమసిద్ధి, కోట్ల సరళ శతకం, వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర ఇలా ఎన్నో సంపుటాల మైలురాళ్లను దాటుకుని వెళ్ళింది.
నాలుగు సార్లు రంజని కుందుర్తి అవార్డు, సరసం అవార్డు, కాళోజీ సాహిత్య పురస్కారం, పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం నుంచి కీర్తి పురస్కారం, సినారె పురస్కారం, వనపర్తి సాహిత్య పురస్కారం ఇలాఎన్నో పురస్కారాలు పొందారు.
వీరు నానీల రచనలో సిద్ధ హస్తులు. అమానవీయ సంఘట నలు, మానవ హక్కుల ఉల్లం ఘన పట్ల కవులు అప్రమత్తంగా ఉండాలి వాటిని తమ రచనల్లో ఎండగట్టాలి అంటారు.
నాన్న నాలా ఎదుగు అనే దీర్ఘ కవితలో
నాన్నా నన్ను కంట కనిపె ట్టండి, పెంచండి పోషించండి
అంతే కానీ నా కలలు కూడా మీరే కనకండి
ర్యాంకుల కలల అగ్నికి భావిభారత పౌరులు ఆహుతి అయిపోతున్నారు
డాలర్ల వేటలో మానవ సంబంధాల ఎముకలు విరిగిన చప్పుడు వినిపించదు
నువ్వో నాతో ఉండిపో ఎదగాలి నాన్నా ఎదగాలి పిల్లలె త్తుకు ఎదగాలి
అంటూ తల్లిదండ్రులు తమ కలలను పిల్లలపై రుద్దడాన్ని చక్కగా అభి వ్యక్తీకరించారు. కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారు రాసిన ఈ తొణకని వాక్యంలో విభిన్నఅంశాలు చోటు చేసుకున్నాయి.
కరెన్సీ నుంచిస్త్రీల ఔన్నత్యాన్ని చాటే కవితల వరకు ఎన్నో ఉన్నాయి. కవిత్వం గురించి వారేం చెప్పారో వారి కవితలలోనని కాసేపు చూసొద్దాం.
నేను కవిని రాజ్యం పరాయిదైతే కూల్చడంఎరుకే
కవికి నిజాయితీ లేకపోతే కాలం నిద్రపోతుంది
కవిజీవ నది తీరాన్ని ఒరుసుకుంటూ నిత్యం ప్రవహించే హది.
కవిత్వం అతని జీవనాధార నిత్యం
ఎగసి పడే నయాగరా
ఎత్తుపల్లాలు లెక్కించకముందుకు సాగడమే అతని చైతన్యం అంటూ కవి ఎలా ఉండాలో అన్న తన భావనలో వ్యక్తపరిచారు.
వాడుక భాషలో లోతైన భావనతో సమాజం నాడి ఎరిగి వర్తమాన పోకడల నాడి చిక్కించు కున్న కవి కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి. అరిగి పోయిన మాటలతో కవిత్వాన్ని పండించొద్దు పాకానికైనా కవితా పాదానికైనా ఒక వెంటాడే తనం ఉండాలి అంటూ సారవంతమైన వాక్యాన్ని ఏర్చి కూర్చ డానికి ఈ కవి ఎంతగానోకషి చేశారు.
అందుకే వీరి తొణకని వాక్యానికి సాహితీ గౌతమి వారి సినారె పురస్కారం దక్కింది. వీరి కలం నుంచి ఎన్నో కవితా ఆణిముత్యాలు జాలు వారాలని మరిన్ని పురస్కారాలు అందు కోవాలని ఆకాంక్షిస్తున్నాను
- ఘాలి లలిత ప్రవల్లిక
9603274351