Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేహం మీది గాయాల్నీ
లోపలి దుఖాన్నీ మోస్తూ మోస్తూ
బాగా అలిసిపోయాను
ఎంతగా అంటే
అలసట గురించి మాట్లాడలేనంత
అలసట పూర్తిగా మనసునీ ఆలోచననీ
ఆక్రమించే వేళ
ఓ రెండు వాక్యాలు జనించాయి
రెండు పదాలున్న ఓ చిన్న కవిత
కాగితం మీద ఒరిగిపోతూ
ఇట్లా అంది ...
నీ గాయాల దుఖభారాన్ని నాతో పాటు దించేయి
మేమట్లా విచ్చుకుని విరబూసి
లోకాన్ని తడిపేస్తాం నిండా ముంచేస్తాం
నువ్వు కొంచెం సేదదీరు
- వారాల ఆనంద్