Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదో అందని అందలం
అది విరజాజి పాన్పు
సుగందాల్ని విరజిమ్మే
హంసతూలికా తల్పం
మా ఊరి సుందరి
అత్తరు చెరువు
ఖబ్దాఖోరుల కళల తరువు
మల్లెలు ముడిచి
మైమరిచే మా వీదికి
చిత్రపురుల చిరునామా
నగరం
మఖమల్ సోయగపు
పాము కుబుసం
సిమీంటిటుక సౌధాలు
రవికను పోలే ఎత్తు పల్లాలు
బొమ్మల జలతారు దుపట్టా
అదే స్థాయి భావసంతర్పణ
నాటుకి, నీటుకి
వున్న వ్యత్యాసం
తాగి తూగి
కటిక నేలైనా
హంసతూలికా తల్పమే
కామాటిపుర
బురద మడుగు అంచున
మురుకి దేహాలు మత్తులోనే
స్వర్గలోక సంచారమే
నగరం, నది దేహం వేరు కాదు
పొగ చూరిన దేహాలు
ప్రతి హదయ స్పందన
మూసీనది పరవళ్ళు
ఇదో జనసునామి
నగరం నగ నగిషీ
కుతుబ్ షాహీల
సౌందర్య లాలసే
ఎందరో నీరోలు
తమ ఉత్సవాసే అని
వాపోతుంటారు
రోజు వారి కూలీ
కార్మికుల రెక్కల కష్టమే
అలిసిన వారి కండల వీరత్వమే
నగరం
మా హదయ సుందరి
కలల రేరాణి
మింగలేక మేం
గుటకలు వేస్తున్న వేదన.
-హనీఫ్
9247580946