Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పన్నెండు వందల మంది చస్తే
తెలంగాణ వచ్చింది
రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకే
మన నీళ్లు మనకే మన నిధులు మనకే
ఎవల చెయ్యిలు వాల్ల నెత్తి మీదనే
ఏమి వచ్చిందో ఏమి ఇచ్చిండ్రో
అవసరం ఎలా ఉంటుందో చూడుండ్రి
ఎటువంటి కాలం నడుస్తుందో చూడండ్రి
ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు
ఎట్టకేలకు నింపిండ్రు పోలీస్ ఉద్యోగాలు
ప్రజల రక్షణ కోసమేనని అంటుండ్రు
మన కవులు రచయితలు
సమాజాన్ని మరింత తట్టి లేప్తరేమో
అనుకుంటే సన్నాయి నొక్కులు నొక్కుతూ
ఏ రోలు కాడి పాట
ఆ రోలు కాడనే పాడుతుండ్రు
చూస్తే నాకనిపిస్తుంది
ప్రేక్షకులకు ఎరుకైనా
పాత్రలకు తెలిసే వరకు
బల్మీటికైన బాధకైనా
సినిమా చూస్తూనే ఉండాలి
రూపాయికి కిలో బియ్యం
ఆసరా పింఛన్
దర్బార్ లా బార్లు తెరవడం
నల్లా తిప్పితే కుల్లం కుల్లా నీళ్లు
కాలు అడ్డం తీస్తే పారుతున్న పొలాలు
ఇంకేం తక్కువ మనకు
తిన్నది అరగక లొల్లి
ఎందుకైనా మంచిదని
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని
చైసంచి తీసుకొని
బియ్యం వరుసల దయ్యంలా గుసాయించిన
నసీబ్ ఎట్లా మారిందో చూడు
ధనిక రాష్ట్రం మనది
కొంచెం అటు తిరిగి
వంగి నమో లేదో... మాయం
ఖజానా ఖాళీ
మోచేతికి బెల్లం అరచేతిలో వైకుంఠం
నాడు అన్నలు మేమున్నాం అన్నారు
ఇయ్యాల ప్రభుత్వం మడుగు బురదలో
బోర్లాడుతూ
పన్నీరుతో పెయ్యి కడుక్కుంటున్నామని
పె(గ్గు)గ్గెలతో మైమచిపోతుండ్రు
- బరాబరి శబరి