Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లి
కుట్లగుణంతోని నరకాయ ప్రవేశం చేసి
మస్తొద్దులె అయింది
ఈగ
ఇంక ఓనమాల పుస్తకం పట్టి
కానిక్ బడిల
తెలుగు మీడియమే చదుతున్నది
చీమకు
అందని శక్కరి షుగర్ బీమారవుతున్నది
దోమనైతె
చెద్దరు కొంచెం తీసుడాలిసెం..
బ్రహ్మ రాసిండో లేదో
నొసటిరాత రాస్తునెవున్నది
నడి ఎండకాలంల సుక
దేహాన్నె కాదు
దేశాన్ని చలిజరంతో వణికిస్తది
మోకాళ్ళు మోచేతులు
వొంటి కీళ్ళన్ని యిర్వకుండనె
మూలకు పడేసి
జరం పొయ్యి రాజేస్తది
గరీబనె కాదు నవాబుకు
బొండిగ తడిపే నీళ్లల్ల పుట్టే
బొంద తవ్వుతది
నీ..నా..
ఇగురంలేని పనుల
ఇత్తుల పుట్టే
యిషం పోస్తున్నది
మన నెత్తుటిబొట్టుగ
ఎగురుకుంటనె
మనబతుక్కు పులిస్టాపౌతున్నది.
- మడిపల్లి రాజ్ కుమార్
99496 99215