Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ పాదాలకు
అదేటమి పెద్ద సోద్యం కాదు..!
అనునిత్యం అరకనే
ఆయుధంగా చేతబూని
ప్రతినిత్యం పచ్చని ప్రకతితో
కరచలనం చేస్తూ...
కరువునే
కర్రుతో తరిమిన
అ పాదాలకు
అదేమి పెద్ద సోద్యం కాదు..!
నిండు అమావాస్య నాడు
పూర్ణమి చంద్రుడిలా
నల్లరేటగడి నేటలలో
వేకువ పొద్దై ఉదయిస్తూ
పలుగు రాళ్ళలో
పసిడి పంటలు దీసిన
ఆ పాదాలకు
ఆ పని గడ్డి పరకతో సమానం..!
చీదరించిన
కాలన్నే చేరదీస్తూ...
చెలిమె నీళ్లతో
దూపదీర్చుకుంటూ..
ప్రకతి సష్టించిన ప్రళయాలపైనే
శాంతి ఖవాత్ జేటసిన..
ఆ పాదాలకు
అదేమి పెద్ద సోద్యం కాదు..!
నిజాం కురిపించిన జడివానపై
సాయుధ పోరాటంతో
వోనుకు పుట్టించిన
జాతిరత్నానివి ఆ పాదాలు....
తెల్ల బట్టలు ధరించిన
నల్లని మనస్సుతో
నేతలు జేటసిన...
నల్ల చట్టాలు
రద్దు చేయకుంటే
తెల్లవారేటలోపే
నాగలితో పార్లమెంట్ నే దున్నెయ్యడం...
అదేటమి పెద్ద సోద్యం కాదు అని
నినదిస్తున్నాయి మట్టి పాదాలు.....
- ఉప్పరి తిరుమలేష్
9618961384