Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అక్షరాలు''ఆయుధాలు పేల్చే ''క్లూ''లు
''పదాలు'' రోషాలకు ''చిరునామా''లు
''వాక్యాలు'' ఎత్తుగడకు ''పునాదులు''
''పాటలు'' తిరుగుబాటుకు ''రాగాలు''
''కథలు'' పోరుబాటకు నడిపించే ''దార్లు
'' కావ్యాలు'' తిరుగుబాటు (విప్లవ)
''పోషక మాన్యాలు''
''నాటకాలు'' ఆధిపత్య వేషాలను
బద్దలుకొట్టే ''గూఢ చార చర్యలు''
''జానపద కళలు'' పేదలగుండెల్లో
రగులుతున్న త్యాగాలకు ''పునాదులు''
ఈ లక్షణాలన్నీ కలిపితే
సమాజంలో పొద్దు పొడిపించే చైతన్య రూపం
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం
అది బతుకువెతలకు వైద్యం
ఆత్మ విశ్వాసానికీ ఆత్మ ధైర్యానికీ ఆలంబన
ధీరోదాత్తతకూ ఐక్యతకూ
కార్మిక కర్షక కూలీ శక్తుల ఉత్ప్రేరకమే కాదు
మార్పు ఉద్యోగ వాచకం
ప్రజా విజయానికి సోపానంవేసే చిరునామా
ప్రజలు కన్నెర్రచేస్తే ఆధిపత్యానికి
పుట్టగతులుండవని తీర్పు చెప్పిన న్యాయస్థానం
అదే వీరతెలంగాణ సాయుధ పోరాటం
(వీర తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవం సందర్భంగా)
- వల్లభాపురం జనార్దన
9440163687