Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కంటి ముందు దశ్యాలను మనసులో చిత్రిక పట్టి అక్షరాకతి ఇచ్చే ఓ గొప్ప ప్రక్రియలలో కథ ఒకటి.
ఇంటి నుండి ప్రపంచం దాకా, రక్త సంబంధాలు నుండి మానవ సంబంధాలు దాకా ఒక మనిషి అనుభవంలో ఎదురైన ప్రతి సంఘటనలో ప్రతి పాత్రను లోతుగా పరిశీలించి 13 కథలతో ప్రముఖ రచయిత జంధ్యాల రఘుబాబు రాసిన కథలు ''అద్దంలో బొమ్మలు''.
అనుభవంలోకి వచ్చిన ఏ అంశాన్ని వదలక ఓ ఉత్తమ ఆలోచను జోడించి సమస్యను ఎత్తి చూపడంలో ఒక కొత్త దారిని వెతుక్కొని, అదే స్థాయిలో ఓ ఉన్నతమైన ముగింపుతో కథకు పరిపుష్టం చేయడం ద్వారా పాఠకులలో ఓ ఆసక్తిని, ఓ ఆలోచన రేకెత్తించి సఫిలీకతులయ్యారు రచయిత. ప్రతి కథలో సన్నివేశాలను గమనిస్తే చాలా సరళంగా ఉండటంతో పాటు కొన్ని చోట్ల ఆయన కలం కవిత్వ పరిమళం కూడా గుప్పించింది. ఏ కథను చదివినా ఓ పరిషత్ నాటికను చూసినట్టు భావన ఉంటుంది. సహజ ధోరణిలో చక్కని మాటలతో సాగే కథనం ఓ ఆదర్శయానికి దారితీస్తూ సమాజానికి ఓ ఆలోచనను అందించింది. ఈ అద్దంలో కనిపించే ప్రతి బొమ్మలాంటి ప్రతి కథ అంతర్గతంగా విలువైన అంశాన్ని కలిగి ఉండటం విశేషం. నూరుశాతం సమాజానికి, కుటుంబానికి, వ్యక్తుల ప్రవత్తులకు అద్దంపట్టి, పాఠకులను చదివించి ఓ భావనను హదయానికి హత్తుకునేలా చేయడం ద్వారా జంధ్యాల అనుకున్న లక్ష్యాన్ని పొందారు.
తెలుగు భాషను ప్రాణంగా భావించే ఓ ఆంగ్లోపాధ్యాయుడు వందల మందికి చక్కని విద్యాబోధనతో పాటు మాతభాషలో ఉన్నత విలువలను భోధిస్తూ, తన జీవితంలో పాటిస్తూ సాగించిన జీవితం గొప్పది. చివరకు పదవీ విరమణ నాటికి తను సంపాదించిన డబ్బుకు పిల్లలను వారసులుగా, తన జీవితకాలంలో కొన్న పుస్తకాలను గొప్ప ఆస్తిగా భావించి తన వద్ద చదువుకున్న పిల్లలనే వాటికి వారసులుగా భావించి, తను ఎప్పుడైనా ఆ పుస్తకాలను చదవాలని ఉంటే నేనే మీ వద్దకు ఓ వస్తాను అని చెప్పే రాఘవాచారి పాత్ర ద్వారా సమాజానికి ఓ ఆదర్శయాన్ని పరిచయం చేస్తూ ''నవవారసత్వం'' అనే కథ ఇచ్చిన చక్కని సందేశం గొప్పది. యూరోపియన్ దేశాలలో ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే ఓ పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వడం, పుస్తకాల పేర్లను ఇండ్లకు, వీధులకు, బస్,రైలు స్టేషన్లుకు పెట్టుకొని పుస్తకాన్ని నెత్తిన పెట్టుకొని మోయడం జరుగుతుంది. ఈ కథ ఉద్దేశ్యం కూడా అదే. పుస్తకాలను ఆస్తిగా భావించి వాటిని వారసులను ప్రకటించడం ఓ గొప్ప భావన.
మరో కథలో తన ముద్దుల కూతురు ''సునిధి'' పుట్టిన రోజుకి ఓ గొప్ప కానుక ఇవ్వాలని భావించిన మహేష్ చేసిన ఆలోచనే ''బహుమతి'' కథó. ఇందులో తాను ఇచ్చే పుట్టినరోజు కానుక ప్రత్యక్షంగా తన కూతురుతో పాటు పరోక్షంగా ఎంతో మందికి ఉపయోగపడాలి అన్న మహేష్ ఆలోచన ఓ కొత్తదనంతో పాటు గొప్పదనం. తన కూతురుకు తెలియకుండానే శ్రీశైలంలో ఓ వద్ధాశ్రమానికి తీసుకెళ్లడం, తన కూతునికి పరిచయం చేసి పుట్టినరోజు దీవెనలం దుకోవడం అంతటా జరిగేదే. కానీ అక్కడకు వచ్చే ముందే ఆశ్రమం లో 'ఈశ్వర్' అనే వక్తితో మాట్లాడిన తరువాత ''ఒక వక్తికి తోడులా, నీడలా నిలచి మనసును సంతోషపెట్టేది పుస్తకమని, అది వారికి ఇష్టమైన అంశమని తెలిసి, ముందుగా ఎవరికి చెప్పకుండా అందరికీ ఒక్కో పుస్తకాన్ని తన కూతురు చేత ఇప్పించడం జరుగు తుంది. ఇదే తన కూతురుకు ఇచ్చే కానుకగా పేర్కొనడం విశేషం ఎక్కడ. ప్రత్యక్షంగా నాన్న ఇచ్చిన గొప్ప కానుకను మురిసిన సునిధి తన జీవితంలోనూ ఇలాంటి మంచి పనులు చేయదానికి ఇది ఓ పునాది అని చెప్పవచ్చు.
అలాగే మధ్యతరగతి గహిణి కోరికలకు, లేనిపోని హంగులకు గురయ్యే మనసును ఫలితంగా అనుభవించే ఆర్థిక బాధలకు అర్ధంపట్టే కథ ''కారు దిద్దిన కాపురం''. ఇందులో సుధ జీవితంలో కారు కొనాలన్న బలమైన కోరికను వెలుబుచ్చే క్రమంలో ఇబ్బంది పడ్డ భర్త మనోజ్ తన ఫ్రెండ్ సునీల్ కారును తెచ్చి సొంతగా కారు కొన్నట్లు నమ్మించి కేవలం పది రోజుల్లో కారు వల్ల ఓ మధ్య తరగతికి వచ్చే కష్టాలను ఆమె గమనించి మనకు కారు అనవసరం అని తెలియడం సుధ ఆలోచనా శక్తికి ఉదాహరణ. ఈ కథలో ఏ వస్తువైన అవసరమైన స్థితిలో మనిషి ఆలోచించాలి. లేనిచో సుధలా ప్రతివారు బాధపడ వలిసివస్తుంది అన్నదే సందేశం ఇక్కడ.
ఓ తల్లి కష్టాన్ని చూస్తూ కూడా మిత్రులతో కలిసి మందు పార్టీ చేసుకోవాలని కోరికతో అమ్మ ప్రేమను అడ్డుపెట్టుకొని సాధించిన డబ్బుతో సరదా తీర్చుకొని ఆనందపడ్డ సురేష్ ఆ డబ్బు ఎలా వచ్చిందో ఆలోచించే మనసును కప్పేసిన వయసు ప్రతివారి జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితే.
బిడ్డ కోసం భరించే కష్టం వెనుక అమ్మ ప్రేమంటే, తల్లి కష్టాన్ని ఆలోచించనీయని తప్పిదాలు వెనుక వయసు తప్పిదం ఉంది. చివరకు వీధిలో మందు సీసాలను ఎరుకుని, వాటిని అమ్మిన వచ్చిన డబ్బుతో తన మందు సరదా తీరందని తెలుసుకుని ఆ పసిప్రాణం గాయమైన మనసులో 'అమ్మా ఇక జీవితంలో ఎప్పుడూ తాగను' అన్న పెద్ద మాటకి నెలల చిన్న పిల్లవాడిలా కనిపించిన కొడుకుని మురిసి పోవడంతో ముగిసిన ఈ కథ అమాయకమైన పసిమనసుకు పుట్టే కోరికలు తీవ్రమైన తప్పులుగా మారకముందే రాకేష్ లాంటి మిత్రులు కళ్ళు తెరిపించడం బాగుంది.
ఉదయం నుండి సాయంత్రం దాకా ఇంటిపనులతో సతమత మవుతూ, అందరికీ సేవ చేస్తూ బాధ్యతను పలు రూపాల్లో జీవిత మంతా మోసే అరుణకు ఓ కొత్త వస్తువును తెచ్చి సంతోష పెట్టాలని చూసిన భర్త శేఖరును మెచ్చుకుంటూనే, ఇంట్లో ఏ వస్తువు తెచ్చినా ఆ వస్తువు వెనుక దాగిన రహస్యం అది ఇచ్చే సౌకర్యం త్వరితగతిన లభించడం ఎవరికి? ఇందులో వంటగది లోకి కొత్తగా వచ్చిన నాలుగు బర్నర్ స్టవ్ వల్ల ఇల్లాలకి సుఖం అని అనిపించినా, దాని ముసుగులో దాగిన సుఖాలన్నీ ఎవరివి? అన్న ఓ ప్రశ్నతో ముగిసిన కథతో ఓ సెటైర్ లాంటి సందేశం ఇచ్చింది.
తరగతి గదిలో మాస్టర్ ఇచ్చే ఓ మంచిమాట, ప్రోత్సాహకాలు పిల్లలు పట్ల వీపరీతమైన ప్రభావితం చేస్తాయి. హుస్సేను మాస్టర్ తను పెట్టిన పోటీ లాంటి పరీక్ష మార్కులకు ఇచ్చిన ఓ బహుమతి ''నోట్ బుక్''. అందరిలో అందుకున్న అనుభవం పిల్లవాడి మదిలో శాశ్వతంగా మిగిలిన గొప్ప సంఘటన. దీని మూలంగానే మాస్టర్ గారి చలువతో జీవితంలో ఓ టీచర్‌గా తన గురువుగారితో కలసి పనిచేసే సందర్భం రావడం ఓ గొప్ప భావన. నిజానికి నాడు నోట్ బుక్ పొందిన సందర్భములో ప్రపంచంలో ఉన్న కొండ శిఖరాలన్నింటిని ఎక్కిన ఆ ఆనందమే జీవితంలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించడానికి కారణం అవుతుంది. ఈ ''నోట్ బుక్'' కథలో హుస్సేన్, మహేష్ లాంటి పాత్రల ద్వారా ఓ ఉపాధ్యయుడు, టీచర్ ఎలాంటి అనుబంధాన్ని కలిగి ఉండాలో తెలిపారు.
ఊరిలో ఎవరు చనిపోయినా, తన సొంత ''మనిషి'' పోయినట్లుగా ఏడ్చే ఈశ్వర్ తన జీవితంలో జరిగిన విషాదాన్ని ఎక్కడా చూసినా ఓ బంధువుగా బాధడటం అందరికి సొంత మనిషిలా భావించె కథ ''అందరి బంధువు''. ప్రతివారిలో ఏదో ఓ మూల మానవత్వం ఉండొచ్చు. నిత్యం అత్తగారిని నిందించే కోడలు దీవెన మధ్యలో జరిగిన సంభాషణ బంధాన్ని గౌరవిస్తూ సాగే క్రమంలో ఒకరునొకరు అర్థం చేసుకుని ముందుకు నడిచి పుట్టినిల్లులా సంతోషాన్ని సాధించుకునే కథనమే ''పుట్టినిల్లు''.
జీవితంలో విధి వసాత్తు బంధాన్ని కోల్పోయి సంఘంలో పిచ్చివాడిగా ఉన్న నారాయణ ఖేమాన్ను ఇంటికి తెచ్చి సాధారణంగా కనిపిస్తూ అసాధారణమైన రచనాశక్తిని, ప్రతిభను గుర్తించి, అతని రచనలను పత్రికలకు పంపుతూ వాడిలో ఉన్న భవనాశక్తి వథా కాకుండా ఎన్నో రచనలు చేయించి అందరికీ ఓ రచయితను పరిచయం చేయడమే ''ఇదీ ఒక కథే''.
ఇలా విభిన్నమైన మనసులను పాత్రలుగా తీసుకుని పలురకలుగా కథను అల్లుతూ, చక్కని ఆదర్శం, సందేశాన్ని ఇచ్చేవే ''అద్దంలో బొమ్మలు''. సాధారణ పాఠకులకు సహితం ఓ మంచి నడకను నిచ్చి, సులభంగా అర్థమయ్యే విధంగా సమస్యను ఎత్తిచూపి, ఆలోచన కలిగేలా చక్కని కథలను అందించారు జంధ్యాల రఘుబాబు గారు.ప్రతి కథలో కుటుంబాన్ని, విలువలను, బంధాలని, గౌరవంగా భావిస్తూ, దీనిపరంగా ముందుగా వ్యక్తిలో మార్పు రావాలని, తరువాత సంఘంలో మార్పు రావాలని ప్రతి కథకు ప్రాణం పోశారు.
అతి సౌకర్యవంతమైన భాషలో, అంత్యంత సులభ శైలిలో పండిన కథను ప్రతివాడు చదివి ఆనందాన్ని, ఆదర్శంగా ఆలోచించడం జరుగుతుంది. అలాగే ఏ కథను తాకిన అందులో కుటుంబ నేపధ్యం మనసును అంటి, మనిషి నైజాలను అద్దంపడుతుంది. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే రచనలు చేసి కొత్త కలాలకు, ప్రాథమిక స్ధాయిలో విద్యార్థులకు, కొద్ధి నిడివి గల ఓ మంచి కథల పుస్తకం ''అద్దంలో బొమ్మలు''.
- చందలూరి నారాయణరావు, 9704437247