Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహిత్యంలో రాటుతేలింది. దళితులకు అంటరానిదైన అక్షరం అంటరానివాడకొచ్చి అక్కువ
చేర్చుకుంది గ్రాంధిక భాష నుంచి సరళ సుందర సులభశైలి, పామరులకు సైతం మెప్పించే రీతిన
భాషాశైలి జాషువా కలం నుంచి జాలువారింది. తెలుగు సాహితీయవనికపై తనదైన ముద్రను
వేసిన కవి జాషువా! సాహితీక్షేత్రంలో ఆనాడైననూ అతనికంటే ముందైననూ ఉద్దండులై
పేరెన్నికగన్న కవిపుంగవులు ఎందరో. చరిత్రని వినుతికెక్కినవారు కొందరైతే, చరిత్రకెక్కని ఘణాపాటీలు మరికొందరు చరిత్రకెక్కని చరితార్థులు ఎందరెందరో. ఒక అధమకులంలో పుట్టి
విశ్వకవిగా వినుతికెక్కినవారు కొందరు వారిలో జాషువా ఒకరు.
తెలుగు సాహితీయవనికపై తనదైన ముద్రను వేసిన కవి జాషువా! సాహితీక్షేత్రంలో ఆనాడైననూ అతనికంటే ముందైననూ ఉద్దండులై పేరెన్నికగన్న కవిపుంగవులు ఎందరో. చరిత్రని వినుతికెక్కినవారు కొందరైతే, చరిత్రకెక్కని ఘణాపాటీలు మరికొందరు చరిత్రకెక్కని చరితార్థులు ఎందరెందరో. ఒక అధమకులంలో పుట్టి విశ్వకవిగా వినుతికెక్కినవారు కొందరు వారిలో జాషువా ఒకరు. జాషువా యుక్త ప్రాయంలోనే అనేక కష్టాలను అధిగమించి దుఖాఃన్నిధిగమింగిన వాడు అయితేనేం యవ్వన దశలో సాహితీవనంలో ఓలలాడినాడు.
సాహిత్యంలో దళితుల ప్రస్థావననూ, దళిత జీవన విధానాన్ని దళిత స్పహతో రచనలు సాగించిన వాళ్ళు వేళ్ల మీద లెక్కించగలిగిన వారు కొందరే. దళిత ప్రస్థావన కన్పించినది మొదటిసారిగా ఆంధ్రభారతీ పత్రికలో ''మాలవాండ్రపాట'' దీని రచయిత ఇంతవరకు స్పష్టం కాలేదు, తల్లాప్రగడ సూర్య నారాయణశాస్త్రి
''హేలావతి'' అనే నవల రాసి దళిత స్పహచాటుకుండు. అలాగే ఉన్నవ లక్ష్మిణారాయణ ''మాలపల్లి'' (1922) తను జైలులో ఉండగా గాంధీ భావజాలంతో హరిజనోద్దరణకు పూనుకొని రాశారు. అదే కోవలో వేటూరి ప్రభాకరశాస్త్రి ''పుల్లంరాజుకథ'', గురజాడ ''లవణరాజుకల'', ముత్యాల సరాలు'', కాళీపట్నం రామారావు ''యజ్ఞం'' కథ, కొడవగంటి కుటుంబరావు ''చదువు'' మొదలగు రచనలుసానుభూతి రచనలుగా చెప్పక తప్పదు. కాని ఆయారచనలతో వారువాసికెక్కి కేంద్ర సాహిత్య పురస్కారాలు దక్కించుకోవడం విశేషం. అలా దళిత స్పృహతో రచనలు చేసిన వారు కొందరైతే తమ జీవితాలను తామే లిఖించుకుంటామని ఆకోణంలో దళిత రచయితలు, కవులు బయలుదేరారు. సంస్కర్త మేదరి భాగ్యరెడ్డి వర్మ, గొట్టిముక్కల మంగాయమ్మ, జాల రంగస్వామి, బత్తుల శ్యాంసుందర్ ఆపరంపరలో బోయి భీమన్న గుర్రం జాషువాలను, కుసుమ ధర్మన్న (మాకొది ్దనల్లదొరతనము, హరిజన శతకము) తమ జీవితాలను తామే రాస్తూ సాహితీ చరిత్ర యవనికపై దళితముద్రను వేసి సుసంపన్నం చేశారు. అనంతర కాలంలో తొండం రచయిత దేవేందర్, తాడి నాగమ్మ లు దళితముద్రను ఆనాడే వేశారు. 80, 90వ దశకాలో చిక్కనపుతున్నపాట, దిశమొల నందివర్ధనం, నల్లగేటు, ఎండ్లూరి నల్లద్రాక్ష పందిరి, గోసంగి కవిత్వం ఆపరంపరలో వచ్చాయి. మేమే, మోగి, వేముల ఎల్లయ్య, ముల్కి దళిత కవిత్వం. భూతం ముత్యాలు దుగిలి దళిత కవిత్వం. కదిరె కృష్ణ బలగం, జి.వి. రత్నాకర్ ముసిబాస కవిత్వం, జి. లక్ష్మినర్సయ్య దళిత కవిత్వం 1,2 సంకలనాలు తెలుగు నేలన దళిత ఉనికిని చాటుతూ దశదిశల పరిఢవిల్లుతుంది. ఒకనాడు అటవెలదిలో వేమన
''మాలవాని నేల మహిలోన నిందింప
వొడల రక్తమాంసంబు వొకటి గాదే
వానిలోన మెలగు వానికులంబేది
విశ్వదాభిరామ వినురవేమ!''
అని యోగి వేమన దళిత సృహతో, పోతులూరి వీరబ్రహ్మం తత్వాలు, దున్న ఇద్దాసు తత్వాలు జగద్విదితం చాటారు. జాషువా బాల్యం నుంచి వాడలో ఊరిలో, బడిలో తను స్వయంగా ఎదుర్కొన్న అవమానాలు, చీత్కారాలు, అంటరానితనం అతనిలో మరింత కసిని రేపాయి అంటరానిదైనా అక్కున చేర్చుకున్న అక్షరం అనతికాలంలో వినువీధికెక్కింది అతని కలం నుంచి కావ్య ఖండికలు ఎన్నో పురుడుపోసుకొని వేనోళ్ల కొనియాడబడ్డాయి. యవ్వనప్రాయంలో ఉత్తుంగ తరంగమై ఎగసిన కవితా ఝరి ప్రవాహమై పరుగులు తీసింది. భావ కవితా వొరవడిలో కృష్ణశాస్త్రి, విశ్వనాధ, చలంలకు ధీటుగా తనదైన శైలిలో జరా అనిపించుకుండు జాషువా అతని ఖండకవితలుమచ్చుకు కొన్ని పరిశీలించిన ''రాజుచేతి కత్తి రక్తంబు వర్షించు - కవి చేతికలము సుదలు కురియు'' అట్టిది రూఢిపరుస్తుంది. తనజాతి వెతలను తెల్సుకొని ఈ కర్మభూమిలో దేవుడొక్కడే మాకు దేవలంబులు రెండు దేశమొక్కటి మాకు తెగలు మెండు'' అంటాడు తన జాతి జనుల అవస్థనుజూచి.
గూరజాడ (1911) ''మాలలు''లో
''మలిన దేహుల మాలలనుచును
మాలిన చిత్తుల కధిక కులముల
నెలవొసంగినవర్గ ధర్మ మధర్మ ధర్మంబే?
అనే ప్రశ్న సందిస్తూనే ''మంచి చెడ్డలు మనుజులందున ఎంచి చూడగ రెండే కులములు మంచియన్నది మాలయైతే మాలనే అగుదున్'' అంటాడు గురజాడ. 1919 నాటి గరిమెళ్ళ వారి పంచములు, 1921 నాటి చెరుకువాడ రామోజీపురపు జంటకవులు ''పరకు సేయుట పాడిగదురా'' గీతాలు చూడవచ్చు. దళితులు సామాజిక, ఆర్థిక, రాజకీయ దోపిడికి అనదిగా గురికాబడుతున్నారు. అందుకే వారి ఆర్తి గుర్తెరిగి వారి విముక్తికై వెట్టి నిర్మూలనకై కులం తుట్టెకదిల్చాడు.
''పంచములలోన మాదిగ వాడను నేను
పంచమీయులలో మాలవాడతండు
ఉభయులము క్రైస్తవ మతాన నొదిగినాము
సోదరత గిట్టుబాటు కాలేదు మాకు''
''వాని గుడిసె మీదవాలినకాకి
నా గుడిసెమీద వాలగూడదెపుడు''
''మతములోన ఒకింత మాట పొత్తె కాని
పొత్తులేదు మాకు పోరుగూర్కు
సిగ్గువిడిచి హెచ్చుతగ్గుల కోసమై
తన్నుకొంటమాట తప్పలదేరు.''
జాషువా హిందువుగా పుట్టినా క్రైస్తవునిగా పెరిగి పరమత భావాలతో రచనలు చేసిన మహాకవి అందుకే ఆయన విశ్వనరుడనేను అని చాటుకొన్నాడు. కులమతాలు గీసుకున్న గీతల్చి చెరిపివేయడానికి జీవితమంతా కలం ఆయుధంతో నిరంతరం పోరు సల్పినాడు. ఇంకా
''ముప్పది మూడు కోట్ల దేవత లెగబడ్డ దేశమున భాగ్య విహానుల క్షుత్తులారున్'' మనోవేదనతో పలుకుతాడు. అలాగే ఈ కులమతాలే గాక ప్రజాస్వామ్యం ఎలా కూనరిల్లుతున్నదో అభాసుపాలగుతున్నదో నేటికి జరుగుతున్న తీరు జాషువా ఆనాడే చాటాడు.
''కూటికి గుడ్డకున్ బ్రజలు కొంగర నోవుచునుండ
నీటుగామోటరు బండ్లపై నగదుమూటలతో కలవారి
బటుబిక్షాటన సాగుచున్నదిజాగ్రత్త,
దేశనివాసులారా....'' అని ఎలుగెత్తి చాటాడు.
అనాథ జాషువా రచనలలో ప్రకృతి పరమైనవి చూడవచ్చు
''గిజిగాడు, సాలీడు, పేర్కొనవచ్చు. అలాగే దేశభక్తికి నిదర్శనలుగా ''బుద్దుడు'', ''భరతమాత, ''వివేకానందుడు'', ''అఖండ గౌతమి'', అలాగే ''సఖి'', ''జెబున్నిసా'' వంటివి ప్రణయ కవితలు. ఇంకా ''పంచముడు'', ''ధర్మకీరీటము'' గుసగుసలు, ''ఇంటిగుట్టు'' మొదలగునవి సంఘ సంస్కరణాత్మక రచనలు. ఇంకా దాదాపు వంద వరకు కవితాఖండికలు రాశారు వాటిలో మచ్చుకు కొన్ని ''శివాజీ ప్రభందం'' (1926), ''స్వప్పకథ'', ''ఫిరదౌసి'', ''ముంతాజుమహలు'' (1981-82) అలాగే అనేక నాటకాలు, గద్యకతులు వారిరచనలు. జాషువా బాల్యం నుంచి అవమానాలు, చీత్కారాలు, దూరం దూరం అని అంటు పాటించడాలు తనలో సమాజంపై కసి పెరిగింది. ఆనాటి సమాజంలో జరిగే జంతుబలులు నిరసించడం అందుకే కాబోలు ఊరి పొలిమేరన అంకాళమ్మ దేవత కారణమని ఆమె కన్ను పెరికేశాడు. పాఠం అప్పచెప్పమన్నందుకు ఉపాధ్యాయుని చెయ్యి కొరికాడు. ఇరుగుపొరుగుల గుసగుసలను ఈసడించుకున్నడు. తను పోకిరియైన తల్లిప్రేమ అతన్ని దాచుకుంది. అప్పుడే ప్రకృతి మాత తన ఒడిన జేర్చుకొని ఆవాహనమైంది. అక్కడే కవితా కన్యక అక్కున జేర్చుకుంది.
''కవితా కన్యకు నల్గురు
కవి జనకుడు బట్టుదాది
అవివేకియే తోబుటువున్
నవరసరసికుడే పెనిమిటి''
అన్న రీతిన తన కవితా దారణ ప్రవాహమై సాగింది. జాషువాను విశ్వనరున్నిజేసింది. అలా ఎదిగాడు రెక్కలు విప్పిన సీతాకొక చిలుకయై స్వర్గానందాలు చవిచూశాడు. ప్రకృతి కాంత ఒడిలో అతని భావకవితా ఝరి ఉప్పొంగింది.
గబ్బిలం :- చిక్కిన కాసుచే దనివిజెందు నమాయికుడెల్ల కష్టముల్ బుక్కెడు బువ్వతో మరచిపోవుక్తుదానల దగ్ధమూర్తిన ల్దిక్కులు గల్గు లోకమున ధిక్కరి యున్నయరుంధతీసుతం డొక్కడు జన్మమెత్తి భారతోర్వరకుంగడగొట్టుబిడ్డడై'' హిందూసమాజవ్యవస్థను ఈ పద్యంలో కండ్ల ముందుంచాడు. మనకు జాషువా గబ్బిలంలోని రెండో పద్యంలో రఘునాధ నాయకుని ప్రస్థావన వుంది ''అప్పరమ అనె గర్భదరిద్రుడు నీతి మంతుడై కాపురముండని చెప్పారు.నిమ్నజాతులకు ఆలయ ప్రవేశం లేదు. హరిజనుల దేవాలయ ప్రవేశం ఈ కావ్యంలో ప్రస్తానించారు.
''గుడికి రమ్మని నంతనే యొడులు మరచి పరువులెత్తుట నా కంఠపరువుకాదంటాడు''. ఆనాటి వ్యవస్థ నిమ్న జాతి అవస్థ మన ముందుంచాడు.
''జాషువా ఉన్నతపాఠశాల పూర్తిచేసిన పిదప1919 నుంచి తొమ్మిదేండ్ల పాటు గుంటూరు ట్రైనింగ్ స్కూల్లో ఉద్యోగం జేసినా తర్వాత ఉభయ భాషా ప్రవీణులై పదిహేనేండ్లు గుంటూరు జిల్లా బోర్డు పాఠశాలలో తెలుగు పండితులుగా పిదప మూడేండ్లు యుద్ధ ప్రచర కోపన్యాసకులయినా, తద్యంతరం కొన్నెండ్లు రేడియోలో ప్రొడ్యూసర్గా పనిచేసినా అనంతరకాలంలో శాసన మండలిలో ఎం.ఎల్.సి. (1969)గా ఉన్నా తన కవితాదాహర్తిని వదలలేదు.
''దారిద్య్రాన్ని కుల భేదాన్ని చీల్చి నేను మనిషిగా నిరూపించుకోదలచాను. వాటిపై కత్తిగట్టాను అయితే నాకత్తి కవిత, నా కత్తికి సంఘంపై ద్వేషంలేదు దాని విధానంపై ద్వేషం'' ఈ అస్పృశ్యతా, పేదరికాలు తనను జీవితమంతా వెంటాడాయంటారు జాషువా! భావకవితాయుగంలో ఆయన రాసిన ''స్వప్నకథ, అనాథ, ముంతాజుమహలు, ఫిరదౌసి'' కావ్యాలను పరిశీలిస్తే జాషువా ఏమిటో మనకు అర్థమౌతుంది.
స్వప్నకథ:- విలసితములైన.......... నెడల సౌఖ్యంబుగలదు'',
''నాకన్న మంద భాగ్యుల
''మొలిచిన యవ్వనంబు........
కాలము స్సత్యాబద్దమై ....
''కలుష్ష...... గొనిసొమ్ము
''నీదు నునులేత......... నన్నెచటుకేని''
అనాధ :- ఓ లలన నీమగండొక
మాలడి.... బలిమికొనిన?''
అలుక శమించెనా.... ముక్తినిచ్చునే?
కొడుకుల సుఖము''
ఒక కవి చైతన్యపరిధిని అతడి కవితా వస్తువు అభివ్యక్తి నిర్థారిస్తాయి. ఒక బలమైన సామాజిక భూమిక లేకపోతే ఎంతగొప్ప కవిత్వం రాసినా అది ఎక్కువ కాలం నిలువదు (ఎండ్లూరి కవనట్టు)
గబ్బిలం:- ''అరుంధతీ సుతుని పట్ల వర్ణ, కుల వ్యవస్థ చూపుతున్న వివక్షని కళ్ళకు కట్టినట్టుగా దృశ్యీకరించాడు జాషువా.
''ఆ యభాగ్యుని రక్తంబు నాహరించిః
యినుప గజ్జల తల్లి జీవనము సేయ
గసరి బుసకొట్టు నాతని గాలిసోకి
నాల్గు పడగల హైందవ నాగరాజు'' అని అంటాడు జాషువా జీవిత సత్యాన్ని ప్రకటిస్తూ ''గబ్బిలం కావ్యంలో కుల వివక్ష వర్ణవివక్ష అంటరానితనం, దళితులకు దేవాలయ ప్రవేశ సమస్య, మాల, మాదిగ జాతులలో గల అనైక్యం, స్వార్థపరత్వం బహుకులమతాల సంఘర్షణ, పెనుగులాట, అసహనంతో నిరసించాడు.
''జీవితం నాకు ఎన్నో పాఠాలు నేర్చింది నాకు గురువులు ఇద్దరు ఒకటి పేదరికం రెండు కులమత బేధం, ఒకటినాకు సహనాన్ని నేర్చితే రెండవది నాకు ఎదిరించే శక్తిని పెంచిందే కాని బానిసగా ఏ మాత్రం మార్చలేదు. దారిద్య్రాన్ని కులబేధాన్ని కూడా చీల్చి వేసి మనిషిగా నిరూపించుకోదలచాను. వాటిపై కత్తిగట్టాను అయితే నా కత్తి కవిత. నా కత్తికి సంఘంపై ద్వేషం లేదు. దాని విధానంపైనే ద్వేషం'' అని ప్రకటించాడు జాషువా. అలాగే గాంధీజీకి హరిజనోద్దరణోద్యమానికి సమాంతరంగా డా|| బి.ఆర్. అంబేద్కర్ మార్చి 1924లో ''అస్పృశ్యతా నివారణోద్యమం ప్రారంభించాడు. ''దళితులు తమస్థితిని తామె గుర్తెరిగి తమను తామే ఉద్దరించుకోవాలి. తమ సమస్యలను తామే పరిష్కరించుకోవాలి. సవరుల కన్నా తాము ఎందులో తక్కువ కాదని గ్రహించాలి'' అనే చైతన్య యుతమైన ప్రబోధాన్ని డా||బి.ఆర్. అంబేద్కర్ దళిత సోదరులకు సూచించారు. గబ్బిలం రెండవ భాగంలో జాషువా... అంబేద్కరు గూర్చి ఇలా... కలడంబేత్కరు నా సహౌదరుడు మాకై యష్టకష్టాలకుం బలియై సీమకువోయి క్రమ్మరిన విద్వాంసుడు వైస్రాయి మెల్కోలు వందుం గల దొడ్డవాడవతను నీకుం స్వాగతం బిచ్చి పూవుల పూజల్ పోనరించనే యతని మెప్పుల్ నీ జయరంభముల్'' అనే పద్యంలో అంబేద్కర్ను ప్రశంసించారు. జాషువా తాత్వికంగా చూస్తే నాస్తికుడుగాదు ఆస్తికుడు దేవునిపేర జరిగే తంతులను నిరసించాడు. కర్మ సిద్దాంతాన్ని దునుమాడినా అయిన నాస్తికుడు కాదు సంఘంలో సాంఘిక ఆర్థిక అసమానతలను నిరసించాడు. దేశీయతను ఆహ్వానించడు - వ్యక్తి సంస్కారాన్ని ప్రతిపాదించాడు జాషువా కవిత్వం దేనిమీద రాసినా శ్రమజీవులను విస్మరించలే సారంశంలో బహిర్ముకుడు.
- భూతం ముత్యాలు