Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన పాటను ఎవరో ఎత్తుకెళ్లారు
ఆటను, పాటను మననుండి
మనకు తెలియకుండానే
మాయం చేసి అందాల అద్దాల
పంజరంలో బందీని చేస్తున్నారు
మాటా,పాటా, ఆటా,
ప్రతి జాతి అస్తిత్వాలు
వారి సంస్కతికి పునాదులు
సగటుబ్రతుకులను దోపిడీ చేస్తూ
మన మనుగడ సందిగ్ధం చేసిన
మాయదారి వర్గాలే
మనలను, మన అస్తిత్వాన్ని
మన జీవన సంస్కతిని దోచేసి
తైతక్కలాటలతో లేని ప్రేమను
ఒలికిస్తూ జరిపే నయాసాంస్కతిక
దాడిని కనిపెట్టి జాగరూకులవాలి
పల్లె పల్లెలో వాడ వాడలో
మన ఆడపడుచులు ఒకటై
కలిసి ఆడుతూ పాడే పల్లే పాటలు
పద్మ, మంగ్లీల జానపదాలు
చిత్తు చిత్తూల బొమ్మ,
ఉయ్యాల పాటల సొబగులను
దొరసానమ్మలు దొంగిలించి
పండుగను, బతుకమ్మను
రాజకీయ రంగులతో రంగరించి
వాసనలేని కాగితప్పూలతో
'జాగతి' కొప్పులో తురుముకుని
పల్లెపాటను, ఆటను, పడతులను
మోసంచేస్తున్న నయా సంస్కతిని
బహుజన బతుకమ్మలంతా
చప్పట్ల హౌరుతో నిలదీయాలి
మన మూలాలకు జీవమైన
మన పాటను, సంస్కతిని
కలుషితం కానివ్వక జాతి ఉనికిని
జాగతం చేయాల్సిందే
పల్లె పాట ఆత్మను రెహ్మాన్,
మీనన్ లు ఒడిసి పట్టలేరని
ఇక్కడి మట్టి పరిమళాలను
ఒళ్లంతా పులుముకున్న
మాపల్లె పడుచుల శ్వాసలోనే
పాటైనా ఆటైనా ప్రాణం
పోసుకుంటుందని తెలపుదాం
- డా|| కె. దివాకరా చారి, 9391018972