Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగు వెలసిన గోడల నుంచి
ఊరుతున్న చెమ్మ
నిత్య దుఃఖమై
దగ్దహదయపు చెలియలికట్టను
ఉప్పెనలా ముంచెత్తుతోంది
పసిబుగ్గలమీదజి
చారికలు కట్టిన కన్నీరు
తనను తానే దహించుకొంటోంది
ముళ్లపొదల్లో నిత్యం విచ్చుకొనే
పువ్వుల చుట్టూ చెదలు చేరుతోంది
నిర్జనవనాల కాలిబాటలమీద
పరుచుకున్న పొదల్లోంచి
పొంచి చూస్తోన్న గండుచీమ
లేలేత దేహాల్ని కాటేస్తోంది
ఒంటికి చుట్టుకున్న తడి
మెల్లగా గడ్డకడుతోంది
కొడిగట్టిన దీపపుకాంతిలో
నీడలు వికతంగా
కదలాడుతున్న చప్పుడు
ఆర్చుకుపోయిన గొంతులోంచి
ఎప్పటికీ చిగురించని పెనుకేక
రేపటికోసం కొనసాగడానికి
విరామచిహ్నాలు లేని వాక్యం
ఈరోజే ముగింపు పలుకుతోంది
నిలువెత్తు ఆవరించిన దైన్యం
ఆకలి కళ్ళల్లోకి సూటిగా చూడలేక
పసిగొంతుల్ని నులిమేస్తోంది
దశ్యం వెనుక
రాతిలో కూరుకుపోయిన కాళ్ళు
నిశ్చేష్టితాలై నిలబడిపోయాయి.
- బండ్ల మాధవరావు