Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్ నలిమెలభాస్కర్ సుద్దముక్క కవిత్వ సంకలనంలో ఉపాధ్యా యవత్తిని, ఉపాధ్యా యున్ని
1)అక్షర ప్రాసన
2)బోధివక్షం
3)గది
4)సుద్దముక్క
5)ఒక్కముక్క కాదుసుమా
6)పవితక్రార్యం
అనేఆరు కవితలలో చక్కగా వివరించారు.
గురువు అనగా గు అంటే చీకటి రు అనగా వెలుగు అని అర్థం విద్యార్థుల అజ్ఞానమనేచీకటిని పటాపంచలు చేసివిజ్ఞాన జ్యోతిని వెలిగించేవారు గురువు. అటువంటి గురువు గురించి 'అక్షర ప్రాసన' అనేకవితలో
''అతడు కాలు మోపడంతోటే
ప్రాంగణంలోని అణువణువూ అక్షరమవుతుంది.
అతని మాటల రెక్కల మీద
పిల్లలు అత్యంత సురక్షితంగా
జ్ఞాన విహాయసంలో విహరించి వస్తారు.''
ఉపాధ్యాయుడు చదువు చెప్పే ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అది పవిత్రస్థలమైతుందని అతని బోధన వలన పిల్లలు జ్ఞాన విహాయసంలో విహరిస్తారని అంటాడు.
అంతేకాకుండా కవి సందర్భో చితంగా ఉపమానాన్ని వేస్తూ తాను చెప్పదలుచుకున్న విషయాన్ని వ్యంగ్యంగా తెలియజేస్తాడు. ''రాముని పాద స్పర్శతో రాయి అహల్యగా మారడం ఏమోగాని ఉపాధ్యాయుని బోధనతో రాళ్ళు రతనాలు కావడం ఖాయమని అనడంలో రాళ్లలాంటి విద్యార్థులు రత్నా లుగా ఉపాధ్యాయుని బోధనల ద్వారా మారుతారని ఉపాధ్యా యవత్తి పట్లతనకున్న విశ్వాసాన్ని నిబద్ధతను పక్రటించాడు.
''క్లాసులో పవ్రేశిస్తున్న పతిస్రారి
అతడికుడిచేతికిఆరోవేలు
అదనంగా మొలుస్తుంది.
అదిఖచ్చి తంగా జ్ఞానం ఘనీభవించిన తెల్లని సుద్దముక్కే'' అంటాడు. ఈ రకంగా అక్షరం జ్ఞానం పెంపొందించే ఉపాధ్యా యుని శరీరంలో సుద్దముక్కను అవయవంగా వర్ణించడంలో వత్తి పట్ల గౌరవంతో పాటు నిబద్ధతను చాటాడు.ఉపాధ్యాయ వత్తిలోని సాధకబాధకాలను చెపుతూ...
''ఓసారిమచ్చుకు ఆచార్యుని ఎదమీద
వెన్నముద్దపెట్టిచూడు
అదిఅతని కష్టానికిక్షణంలో
కరిగికన్నీ రవుతుంది'' అని
ఉపాధ్యా యవత్తి సులభమైనదికాదని అతని కష్టాన్ని ఎత్తి చూపాడు. ఉపాధ్యాయున్ని జాతికి మూలస్తంభం అంటూ పొగుడుతారు కానీ పస్త్రుత కాలంలో ఆ మూలస్తంభాన్ని నిర్లక్ష్యానికి గురిచేస్తున్నారని ఆవేదనను వ్యక్తపరిచాడు.
భోధివక్షం అనేమరొక కవితలో
నల్లబల్లను అయస్కా ంతంతో పోలుస్తూ ..
''నీ చేతి పొత్తిళ్లలో సుద్దముక్క
పసిపాపైవొదిగివొదిగీకడకు కొవ్వొ త్తిలా కాలిపోతుంది వెండితెరలు బుల్లితెరల మీద లగమయిన
పిల్లల మనసుల్ని మీ నల్లబల్ల
ఒక పెద్ద అయస్కాంత క్షేత్రమై ఆకర్షిస్తుంది.''
పిల్లల మనసుల్ని టీవీలు, సినిమాలు ఆకర్షించిన విధంగా నల్లబల్ల అయస్కాంతక్షేత్రమై విద్యార్థులను ఆకర్షించి విజ్ఞానం అందిస్తుందని స్పష్టం చేశాడు. తరగతిగదిలో స్వేచ్ఛ విహంగాలైన విద్యా ర్థులను ఉపాధ్యాయుడు తన జ్ఞానకాంతి చేత ఆకర్షించగలడు. నలిమెల భాస్కర్ గురువును బోధివక్షంతో పోలుస్తూ
''రాత్రి ఆలుబిడ్డల్ని వదిలివెళ్లిన
గౌతముని బుద్దుని చేసినట్లు
పగలు తల్లిదండ్రుల్ని వదిలి వచ్చిన
విద్యా ర్థిని సిద్ధార్ధుని చేసే
నువ్వు బోధివక్షా నివి
నువ్వొక బోధవక్షానివి'' అని,
రాత్రి భార్యబిడ్డల్ని వదిలి అడవిలోక ివెళ్ళిన గౌతముడు బోధివక్షం క్రింద తపస్సు చేసి బుద్ధుడిగా మారాడు. అలాగే
పగలు తల్లిదండ్రులను వదిలివచ్చిన విద్యార్థులను
ఉపాధ్యా యుడు జ్ఞానసిద్ధార్థులుగా తయారుచేసే బోధవక్షం, బోధివక్షంగా అభివర్ణించాడు.సుద్దముక్కను జ్ఞానాన్ని పస్రరింపజేసేదీపంతో పోలుస్తూ
''ఈ దీపం వెలుతురులో
ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు
ఈ కాంతిక్షేతంల్రోనే
మరెందరో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తయారయ్యారు దీని రంగు తెలుపు
దీని కాంతి తెలుపు
ఆయుఃప్రయాణం కాస్త అటో ఇటో అరవైనిమిషాలు'' అంటాడు. సుద్దముక్క విద్యార్థి జ్ఞాన సముపార్జనకు దిక్సూచిలా ఉపయోగపడుతుందని, తరగతికి వెళ్ళే ఉపాధ్యాయునికి అది ఊపిరిగుళికని, అంతేకాకుండా ఉపన్యాసాలకు ఊతకర్ర అవుతుందని దాని ప్రాధాన్యతను తెలియజేశాడు. అంతటితో ఆగక నల్లని బోర్డుపై అక్షరాల్ని కురిపించే ఒక మేఘశకలమని బావుకునిగా వర్ణించి మానససరోవరంలో తెలియాడే రాజహంసతో పోల్చాడు.
కవి దేహంలో సుద్దముక్క కూడా ప్రాణంమున్న జీవిగానే చిత్రిస్తూ ముక్కలుముక్కలుగా సుద్దముక్క తెగిపడుతున్న, క్షణం క్షణం నేలరాలిపోతున్న ఆత్మబలిదానం తప్ప అన్యమెరుగని త్యాగశీలి అని తన దేహమేముక్కలై నట్టు వర్ణించాడు.
సుద్దముక్క కొవ్వొత్తిలా మంచు ముక్కలా కరిగిపోయి, ఫిలమెంట్లా విజ్ఞానాన్ని పంచుతూ సుద్దమొద్దుల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దేది సుద్దముక్కే అని అంటారు.
'గది' అనే మరొక కవితలు ఉపాధ్యాయున్ని
దయామయునిగా కీర్తిస్తూ తరగతి గది, బడి ఔన్నత్యాన్ని ఆవిష్కరించాడు.
''ఎక్కడెక్కడిపల్లెలు తీరాల నుండో
విద్యా ర్థులు విహంగాలై ఎగిరివచ్చి
ఆ వాకిలిపైవాలి తమ ఆకలిని తీర్చు కుంటారు''
విద్యార్థులను స్వేచ్ఛ విహంగాలతో పోలుస్తూ జ్ఞానమనే ఆకలిని తీర్చుకోవడానికి ఉపాధ్యా యుడు తరగతిగదికి తెచ్చిన అక్షరాల జ్ఞాన సంపదను ఆకలింపు చేసుకుంటారని, విద్యా ర్థును విహంగాలుగా, జ్ఞానాన్ని గింజలుగా పోలుస్తూ పక్రతిలోని సహజగుణాన్ని తరగతిగదికి అన్వయించుకుంటూ గొప్పగా చిత్రించడం కనిపిస్తుంది. తరగతిగది విద్యార్థిని అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు నడిపిస్తుందని చెప్తాడు. మరొక కవితలో ఉపాధ్యాయుని గొప్పతనాన్ని కీర్తిస్తూ ఒక్క ముక్కకాదు సుమా అనేకవితలో
''ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా
నీకు పత్య్రా మ్నా యం టేప్ రికార్డ్ కాదు
నీకు బదులు ఏ టీవీ పాఠాలు రావు'' అని
నొక్కి వక్కాణించాడు. పస్త్రుతం కరోనాకాలంలో బోధన మొత్తం ఆన్లైన్ (అంతర్జాలం), టీవి, మొబైల్ లాంటి మాధ్యమాల ద్వారా బోధించడం జరిగింది. అంతర్జాలంలో బోధించే ఉపాధ్యాయుడి బోధన అర్థవంతంగా లేక విద్యా ర్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అందుకేవిద్యా వేత్తలు మేధావులు పత్య్రక్ష బోధన ద్వారా మాతమ్రే మానసిక వికాసం జరిగి విద్యా ర్థి సర్వతోముఖాభి వద్ధికి తోడ్పడుతుందని వాదిస్తున్నారు. ఈ కరోనా విపత్తు రాకముందే ఉపాధ్యాయుని పత్య్రక్ష బోధనకు ఏ మాధ్యమాలు కూడా సరిరావని చెప్పడం కవి దూరదష్టికి నిదర్శనం. విద్యార్థికి ఉపాధ్యాయుడే సర్వస్వం అని చెపుతూ
''నువ్వు రక్తమాంసాలతోనూ
అపారమైనా ప్రేమాభిమానాలతోనూ
పిల్లలముందు కదలాడుతున్న
తల్లివి, తండ్రివి, మిత్రుడివి, వేదాంతివి
పిల్లలతో నోరారా మాస్టారు అని
పిలిపించుకునేఒక కాంతి నక్షత్రానివి''
విద్యార్థులకు ఉపాధ్యాయుడు సర్వస్వం విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపే కాంతి నక్షతం ఉపాధ్యాయుడు అని విద్యార్థులచే గౌరవంగా మాస్టారు అని పిలవబడుతాడని చెప్పాడు. మరొక కవితలో పప్రంచంలోనే ఉపాధ్యాయ వత్తిని పవిత్రకార్యంగా అభివర్ణించాడు.
''ఒక అందమైన గదిగదంతా విద్యా గంధమైన అనుభూతి జ్ఞాన కిరణం సోకిన
గదిసరస్సులో
విద్యార్థుల శిరస్సులు
విరబూసిన తామర్లు కావడం కన్నా
కతార్థత మరేముంటుంది''
విద్యార్థులకు చదువు సంస్కారం ఉపాధ్యాయుని వలన అందినప్పుడే సార్ధకత ఉంటుందని తరగతిగదిలో ఉపాధ్యాయుని జ్ఞానకిరణం సోకి విద్యార్థులనే తామర పువ్వులు వికసిస్తాయని తెలిపాడు. ఉపాధ్యాయుడు నిరంతరం జ్ఞాన తష్ణకలిగి ఉంటాడు. తానుపొందిన జ్ఞానాన్ని తన బోధనలతో విద్యార్థులలో దాగివున్న జ్ఞానానికి మెరుగులు దిద్దుతాడు. అందుకే ఉపాధ్యా యున్ని అతికే సాల్డరింగ్ రాడ్తోపోల్చా డు. కవి నలిమెల భాస్కర్ దష్టిలో పిల్లలకు పాఠాలు చెప్పడమంతా పవితమ్ర ట్కనటువంట కార్యం పప్రంచంలో మరొకటిలేదంటూ ఉపాధ్యాయుని యొక్క ఔన్నత్యాన్ని సుద్దముక్క కవిత్వంలో వివరించారు.
- రేణ ఈశ్వరయ్య
అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలుగు , 8184809687