Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బోసిపోయినిల్చున్న
బడిచెట్టుపై,
ఇన్నాళ్లకు చిలుకలసందోహం
మూలపడ్డ
హార్మోనియం పెట్టెలపై
సంగీతం వాలినట్టుగా.
చెరువు దేహమంతా, కలువపూలు చుట్టినట్టుగా.
కిలకిలా రావాలుంటే చాలు,
కాలాలతో పనిలేదు.
గంతులాడే పిట్టలన్నీ
గోళ్ళతో వసంతాల్ని అద్దిపోతాయి.
ఆకురాలిన కొమ్మల్లో,
కేరింతల గూళ్ళు కడతాయి.
ఇన్నాళ్లూ బోసిపోయిన బడిచెట్టే
నిలువెత్తు పూలబుట్టవుతుంది.
పిల్లనెత్తుకున్న తల్లిలా మురిసి పోతుంది.
- డా. డి.వి.జి.శంకర రావు ,
మాజీ ఎం పీ, పార్వ తీపురం . 9440836931.