Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవితా శక్తి, వారసత్వ బలముంటే కవి సజన తప్పక ప్రజల పెదవులపై నర్తిస్తుంది. అలాంటి వారసత్వమే కవి గుంటూరు శేషేంద్రశర్మకుంది. తండ్రి సుబ్రహ్మణ్య శర్మసాహితీవేత్త, తాత వేద విద్యాధ్యయన శీలి. గురువు నేతి కష్ణమూర్తిశాస్త్రి సకల విద్యాపారంగతుడు.ఈ నేపథ్యంలోప్రభావితుడైనకవి ఆయన. శబ్దం ఆయన ఊపిరి. శబ్దం ఆయన శక్తి. సజనను శాశ్వతం చేసేది శబ్దశక్తి మాత్రమే. ఆయన శబ్దంశక్తి శతాబ్ది కవితనుద్దీపణం చేసింది. ఆనాటి కవుల్లో ఎవరిలోనూ కనిపించని విలక్షణమైన సజన ఆయనలో కనిపిస్తోంది. అద్భుతమైన సాహితీ సష్టి చేసి కవుల్ని, పాఠకుల్ని మెప్పించారు. ఆయన సజన కవితల్లో ఎన్నో అమతం కురిసిన రాత్రులున్నాయంటే అతిశయోక్తికాదు.
మట్టి గుణాన్ని బట్టి పంటను, జిజ్ఞాసను బట్టి సజనను పండించడం శక్తి పరులకే సాధ్యం. దేశానికి నాగలిని ప్రతీకగా చేసిన కవి శేషేంద్రశర్మ తన కవనానికి స్వేదాన్నిప్రతీకగా చేశారు. ప్రతిభ, పాండిత్యం, అనుభవం, ఆయుస్సులు పిండి మాటలను గొంతులో పోసినాడా? అనేట్టుగా శేషేంద్ర శర్మ సజన ఉంటుంది.'నిదురించే తోటలోకి పాట వచ్చి నట్టుంటుంది. సింధువంత చరిత్ర నా పిడికిల్లో వున్నా, చెప్పకుండా మనిషిని చెక్కిన శిల్పిని నేను' అంటూ, వస్తూత్పత్తికి 'ప్రతీకైన చెమటతో మాట్లాడిస్తుంది. ఆరుకోట్లమంది కోసంగాదు 60కోట్లమంది కోసం గొంతెత్తిస్తుంది. ఈ చెట్లు పూలెందుకు పూస్తాయి? బుల్లెట్లెందుకు పూయవు? అని ప్రశ్నిస్తాయి. 'నేనంతా పిరికేడు మట్టే కావచ్చు. కానీ కలమెత్తితే నాకు నా దేశపు జెండా కున్నంత పొగరుంది' అంటారు. 'వేళ్ళు కాళ్ళయి నడిచే చెట్టు మనిషి. చెట్టుగా పుట్టి వుంటే ఏడాదికొక వసంతమన్నాదక్కేది అంటారు. ఓహ్! ఆయన సజనలో వ్యక్తీకరించిన అభివ్యక్తిలో అయస్కారంత ముందేమోనని పిస్తోంది.అందుకే 'నా శబ్ద అయస్కాంతశక్తి పాఠకుణ్ణి ఆకర్షించి అతని మనసును మార్చడమే' పరమార్థమన్నా రాయన.
కవి సంఘంతో, మానవ జీవితంతో సంబంధం ఉండాలి అంటారు. ఎవరి కోసం కలంబట్టాడో, ఎవరికోసం తపిస్తాడో వారి కోసమే తన సజనని సమర్పించు కొంటారు. పరోక్షంగా ప్రజల పక్షాన నిలబడి నిజాయితీగా పోరాడే లక్షణం కవికి ఉంటుంది. నేను కష్ట జీవుల శ్రమనుంచి ఆవిర్భవించిన చెమట బిందువుని, శ్రామికుల కండల సమూహం నుంచి పుట్టిన సూర్యుణ్ణి అంటూనే నేను చెమట బిందువుని... సింధువంత చరిత్ర నా దగ్గరే చేతిలోనున్నఎవరికీ తెలియకుండా మానవ జాతిని నిర్మించిన వాడిని అంటారు శేషేంద్రశర్మ. 'ఏ దేశంలోనైనా కవే నాయకత్వం వహిస్తారు. ఈ దేశంలో రాజకీయ వాది నాయకత్వం వహిస్తే, కవి వాడి అడుగు జాడల్లో కుక్కలా నడుస్తాడ'ని అసహ్యించుకొన్నారు. అలాంటివారిని దిగంబర కవులు కవి పందులన్నారు. ఇలాంటివారు మానవ జాతికి బాధ్యులు కారని ఆయన అభిప్రాయ పడ్డారు.
కర్షకులను, కార్మికులను విస్మరించిన కవులను చరిత్ర క్షమిందన్న రష్యన్ రచయిత గోర్కీ మాట శేషేంద్రశర్మలో బలంగా నాటుకొంది. అందుకే ఆయన అన్వేషనంతా నాగళ్ళను భుజాన వేసుకొన్న రైతులగురించే ఎక్కువగా సాగేది. ఎందుకంటే 'దేశ ప్రజల కోసం సుఖాలు నిర్మిస్తూ, దుఃఖాల దండలు వేసు కొన్నరైతుల అడుగులు వెతుకుదాం రండి' అంటారు కవి. 'మన నాగళ్లకు తగిలే ఆ కోట్లాది గొంతుల్ని ఏరు కొందాం పడండి' అంటారు. నాగలి గురించి ఆయన 'నీవొక కర్ర ముక్కవే కావచ్చు కానీ అనాది సష్టిలో తలయెత్తిన మానవ మహా కషికి ఏకైక చిహ్నానివి' అంటూ వర్ణించారు. ఆయన సజనలో ఈటెల్లాంటి శబ్దాలకు శ్రావ్యమైన సంగీత స్వరాలేవో జతకట్టి సెలయేరులా దూకించే శేషేంద్ర జాలమేదో మన మనసుల్లో మెదలక మానదు.
అనుభవం ద్వారానే జ్ఞానం లభిస్తుంది. విశిష్టులైనవారు తప్ప ఇతరులకెంత కవితా సంపన్నతున్నా కీర్తి రాదు. కవితా వన్నెల వెన్నెల సరస్సైతే శేషేంద్ర అందులో విహరించే చకోరం. కవన మందాకినీ వీచికల తూగే రాయంచ. శబ్ద బ్రహ్మ. ఆయన శబ్దమే అయస్కాంతశక్తి అయింది. ఆయన సష్టించిన అలంకారం అంధకారానికి దీపమయింది. ఆయన కవితల్నిసహదయ పాఠకులు మళ్లీమళ్లీ చదువుకొని ఆనందానుభూతి పొందుతారనే దానిలోసందేహ పడనక్కర లేదు. నెల్లూరుజిల్లా ఉదయగిరి తాలూకాలోని నాగరాజుపాడులో 1927 అక్టోబర్ 20నాడు జన్మించిన శేషేంద్రశర్మ గొప్ప తాత్విక స్పహను అందించి మనను విడిచి 30 మే 2007 నాడు భౌతికంగా దూరమైనాడు.
( అక్టోబర్ 20న మహాకవి శేషేంద్ర 94వ జయంతి సందర్భంగా త్యాగరాయగాన సభలో సాహిత్య సదస్సు)
- ప్రొ|| ననుమాస స్వామి,
9848545949