Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మతోన్మాద టెర్రరిజం
ఆఫ్ఘనిస్తాన్లోనే కాదు
ఇక్కడా ఉంది
అది గౌరి లంకేశుపై చూసాం
అది కల్బుర్గి పై చూసాం
అది పన్సారి పై చూసాం
ఇప్పుడు
మనువాద
ఫాసిస్ట్ పాలకుల టెర్రరిజం
లకింపుర్ రైతన్నలపై
కార్లు మరీ మరీ ఉరికించి ఉరికించి
చంపిన తీరు
ఆ హదయ విదారక దశ్యాలు
సాంఘీక మాధ్యమాల్లో చూసాం
ఎంతో కలత చెందాం
ఆ టెర్రరిజంలో
జనులందరికే బువ్వ పెట్టే రైతన్నల
నిరసన కూడా నేరమే అయ్యింది.
స్వయం ప్రకటిత
దేశభక్తుల పాలన దేశంలో
దేశమే సరుకై
ఢిల్లీ సరిహద్దులమీద
నెలలకొద్దీ సాగు చట్టాలు వద్దంటూ
నెత్తినోరు మొత్తుకునే రైతులే
నేరస్తులయ్యారు.
దీనికి విరుగుడు ఎక్కడో లేదో
అడుగడుగునా ఎర్రజెండాలు
నీలిజెండాలు ఐక్యంగా పోరాడడంలోనే ఉంది
- మార్క శంకర్ నారాయణ
9908416664