Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చంపండ్రా ... చంపండి
ఉద్యమకారున్ని చంపండి
రైతుల్ని చంపండి
మహిళా రైతుల్ని చంపండి.
ట్రక్కులతో తొక్కంచండి
అందర్నీ చంపేస్
శ్మశాన రాజ్యాన్ని ఏలండి
చంపడం తప్ప
బతికించటం తెలియదు కదా
చిన్న మొక్కను
పుట్టించడం చేతకాదు
నిలువెల్లా హింసాద్వేషమే
మనిషితనమే లేని
హంతక పాలకులు
రాజ్యమేలే వేళ
ఇంతకన్నా ఏమి చేయ గలరు
కాలం కళ్ళప్పగించి చూస్తుందనే
చూస్తుందనే భ్రమ
శ్రమ మీ పాషాణ బుర్రలో
తాండవిస్తుంది కదూ
కాలం కబోది కాదు
మానవుడు దానవుడు కాదు
విధ్వంసం చరమాంకం కాదు
ఉద్యమాలే ఊపిరిగా
నవ మానవుడు నిత్యం
పురుడుపోసుకుంటాడు
రక్తరంజిత ఆ శిశువే
జగనాకి వెలుగునిచ్చే
మార్తాండ సూర్యుడు
ఖబడ్దార్!
- కె.శాంతారావు, 9959745723