Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వట్టికోట ఆళ్వారుస్వామి తెలంగాణ ప్రజా ఉద్యమానికి-ప్రజాసాహిత్యానికి ఊపిరి వంటి వారు. ఆయన బాల్యమంతా ఒడిదుడుకుల తోనే సాగింది. ఆయన బతుకుతెరువు కోసం అనేక పనులు చేశారు. ఇళ్లల్లో వంటలు చేస్తూ వారు పెట్టింది తింటూ సూర్యాపేట గ్రంథా లయంలో పుస్తకాలను చదువుతూ ప్రపంచాన్ని తెలుసుకున్నారు. అలా చిన్నతనంలోనే పుస్తక పఠనంపై ఆసక్తి పెంచు కున్న ఆళ్వారుస్వామి అనతికాలంలోనే తెలుగు, ఉర్దూ, హిందీ భాషలపై పట్టు సాధించారు. రచయిత, సేవా శీలి, ఉద్యమకర్త, కమ్యూ నిస్టు నేత, ప్రచురణకర్త, పాత్రికేయుడు, ప్రచారకుడు కాబట్టే భాషాసాహిత్యాల దగ్గర్నుంచి పౌరహక్కుల దాకా వట్టికోట అన్ని ఉద్యమాల్లో పాలుపంచుకున్నాడు.
ఆళ్వారుస్వామి జీవితంలో గొప్ప మైలురాయి సురవరం ప్రతాపరెడ్డి స్థాపించిన గోల్కొండ పత్రికలో పనిచేయడం. తెలుగు తల్లి పత్రికా నిర్వహ కుడిగా, ప్రజాసాహిత్య ప్రచురణకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. దేశోద్థారక గ్రంథమాలను - గ్రంథాలయాలను 1938లో స్థాపించారు. దానిని నుండి 35 పుస్తకాల వరకు ప్రచురించారు. మహానీయుల రచనలను తన సంస్థ ద్వారా ముద్రించి ఊరూరా పుస్తకాలను బుట్టలో పెట్టుకొని వాటిని ప్రజలకు పరిచయం చేస్తూ, అమ్ముతూ తెలంగాణ అంతటా మలయమారుతంలా తిరిగి సాహితి సుగంధాలను వ్యాపింపచేశారు. తమ ప్రజా జీవితపు అనుభవాలను రంగరించి 'ప్రజలమనిషి' అనే గొప్ప నవల రాశారు. ''రచన ప్రసవవేదన లాంటిది. వేదన ఉంటే ఆలోచన ఉద్భవిస్తుంది'' అనే మాట ఆయన తరచూ చెబుతుంటారు. అందుకే ఆళ్వారు స్వామి జీవితాన్ని, సాహిత్య కషిని వేరుచేసి చూడలేం. ఎందుకంటే ఆయన జీవితం అడుగాడుగునా సాహిత్యంతోనే ముడిపడి ఉంది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కాంగ్రెస్‌వాదిగా, హైద రాబాద్‌లో జరిగిన సత్యాగ్రహిగా పాల్గొన్న ఆయన తెలంగాణలో ప్రప్రథమ సత్యాగ్రహిగా ఏడాది పాటు సికింద్రాబాద్ జైలులో వున్నారు. ఆయన ఆ తరువాత ఆంధ్రమహసభ ద్వారా క్రియాశీలకంగా పనిచేశారు. 1944లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకుని తెలంగాణ అంతా తిరగాడిన అక్షర యోధుడు. అప్పటి నిజాంరాజు ఉద్యమకారుల మీద, రచయితల మీద దాడులు చేస్తుంటే దానికి వ్యతిరేకంగా పొరాటం చేశారు. వర్తమాన పరిస్థితుల్లో అలాంటి పోరాట పఠిమను ఆయన నుండి మనం గ్రహిం చాలి. సికింద్రాబాద్ ఉద్యమానికి ఆయనే ఆద్యు డు. 'పీపుల్స్ బుక్ డిపో' నిర్వహిస్తూ కమ్యూనిస్టు సాహిత్యాన్ని ప్రచారం చేస్తూ సికింద్రాబాద్‌లో స్నేహితుల సంఘం- గుమస్తాల సంఘాలను స్థాపించారు. సికింద్రాబాద్‌లో వారు పాల్గొనని ఉద్యమం లేదంటే అతిశయోక్తి కాదు. 1948 లో మరోసారి అరెస్టు అయన ఆళ్వారు స్వామి దాశరథి కష్ణమాచార్యతో పాటు మూడు నెలలు జైలులో ఉన్నారు. ఆ సమయంలో నిజాం పాలనను నిరసిస్తూ దాశరథి జైలు గోడలపై రాసిన పద్యాలను వట్టికోట కంఠస్తం చేసి అందరికి వినిపించేవారు. తన జైలు జీవితాన్ని, సొంత అనుభవాలను, ఖైదీల విభిన్న మనస్తత్వాలను తెలుపుతూ 'జైలులోపల' అనే పుస్తకం రాశారు. ఆళ్వారుస్వామి తెలంగాణ ప్రజా జీవితాన్ని నవలీకరించాలనే బహత్ సంకల్పాన్ని పెట్టుకుని ముందుకు వెళ్ళారు. ఆయన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటాన్ని తెలుపుతూ 'గంగు' నవలను రాశారు. అది మధ్య లోనే ఆగిపోయింది. 'గిర్దావర్' అనే పుస్తకంలో భూస్వాముల అరాచ కాలను రాశారు. 'పరిస రాలు' మరో పుస్తకంలో ముస్లింల జీవన వ్యథలను వివరించారు. తన 46వ ఏట ఆయన డీప్తీరియా వ్యాధితో 1961 ఫిబ్రవరి ఐదున తుదిశ్వాస విడిచారు. ఆళ్వారు స్వామి జీవితం తెలంగాణకే కాదు తెలుగు వారందరికీ స్ఫూర్తి దాయకం. తెలంగాణ నేలపై ఇంత కషి చేసిన ఆళ్వారు స్వామిని, ఆయన చైతన్యాన్ని ప్రజలందరికీ అందించ వలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అదే ఆయనకు మనం ఇచ్చే నివాళి.
- అనంతోజు మోహన్ కష్ణ, 8897765417