Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏం మాయే మీ మాయ
ఎటు తెలవదాయే
మొద్దు మీద కూర్చున్న ఓ మొద్దు నరసిగా ఏమాయ నీ మాయ ఎటు తెలువదాయ
గడీల పాటను కావలి కట్టేసి గంగిరెద్దుల ఆట
అంబేడ్కర్ బోధనల పాలనాదక్షుడు
పొగిడే కాలం వచ్చె
ఏమాయె నీ మాయ ఎటు తెలువదాయె నడిచివచ్చిన తొవ్వను అడవిలో విడిచి పెట్టి అభివద్ధి అభివద్ధి మాటకు అర్థాలుచెప్పుతున్నవ్
నీళ్ళతో దీపాలు వెలిగించడం
పన్నెండు వందల మంది త్యాగాల మీంచి
నడిచి వచ్చి నకరాలు చేసేవాడి ఠీవి
బతుకు తెరువు బహురూపాలు
జోల జాలి తప్ఫి ఆ దీవనార్తి పెట్టి
పిల్ల పాపలు చల్లగా ఉండాలని
కాటి కాపలా గంగిరెద్దుల ఆట
మూలాలు తెలియని ఆట పాట
శతి కళ్ళు తాగి నిప్పు తొక్కిన కోతి
తైతక్క ఇక తిక్క తిక్క మొద్దు మీద
కూసున్న ఓ మొద్దు నర్సి గా
ఏమాయ నీమాయే ఎటు తెలువదాయె
రాష్ట్ర గీతం లేనిచోట ఇష్టము
కాష్టము పేర్చుకున్న ఏక కణ జీవి
ఏ మాయ నీ మాయ ఎటు తెలియదాయె కతకతోలె బతుకు
గడస్తే చాలు నడిస్తే అదే పది వేలు
ఇది ఏ మంచి
ఏమాయె నీ మాయ
ఎటు తెలవదాయె
-జూకంటి జగన్నాథం