Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీకు తెలుసా
నేనిక్కడే వున్నా
మౌనంగా
నువ్వు చూసావా
నేనిక్కడే నిలబడ్డా
తల వంచుకొని
ఎప్పుడయినా గమనించావా
నేనిక్కడే కూలబడ్డా
కాళ్ళూ చేతులు ముడుచుకొని
నేనిక్కడే
తడి కళ్ళతో
నేల తల్లిని దర్శిస్తున్నా
నేనిక్కడే
రెక్కలు తెగిన పక్షుల్ని
కుప్ప కూలిన వక్షాలనీ వీక్షిస్తున్నా
నేనిక్కడే
వేగం తగ్గిన గాలినీ
కళ తగ్గిన నీడనీ చూస్తున్నా
చూసీ చూసి
నేనిక్కడే
ఒక్కసారిగా బద్దలవుతా
తట్టుకోగలవా...... ?
- వారాల ఆనంద్