Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనురాగాన్ని చూపిస్తూ తడిమే చేతుల వైపుకు, బాధలను, గతాలను సమాధి చేస్తూ కొత్త వర్షాన్ని కురిపిస్తూ లోపలి నుంచి బయటకు కొత్త ఉదయపు కిరణాలను నాటుతున్న ఆశలలోకి, కాలం ఎండుటాకుల్లా రాలుతున్నప్పుడు పచ్చబొట్టులాంటి సంతకం చేస్తూ కాలం వాలిపోతున్న వైపు పయనించాలని కవయిత్రి తన మార్గాన్ని స్పష్టం చేస్తుంది. కదిపి చూస్తే అంతరంగం ఉప్పెనలా ఎగిసిపడుతుంది. గూడు కట్టుకున్న స్తబ్ధతలోంచి నిత్య చైతన్య దీపాల్సి వెలిగిస్తుంది.
ఆమె గాయపడిన అక్షరాలకు కవిత్వపు చిరునామా. అందుకే ఆమె ''కాలం వాలిపోతున్న వైపు'' నిలబడింది. తాను జీర్ణం చేసుకోలేని మతోన్మాదాన్ని, కుల వివక్షను, పితస్వామ్య వవస్థ పట్ల, వారి రాజకీయాల పట్ల స్పష్టంగా తన కలం కదిలించిన కవయిత్రి 'మెర్సీ మార్గరెట్'. నూట పది కవితలున్న 'కాలం వాలిపోతున్న వైపు' కవితా సంపుటిలో తనదైన ప్రత్యేక ముద్ర కనిపిస్తుంది. కాలం వాలిపోతున్న వైపు కవితలో
''కాలం వాలిపోతున్న వైపు
నువ్వు చూపుసారించు
ఇరుదేహల మధ్య
ఒకే సామీప్యం
ఒకే ఏకాంతం
ఒకే నిశ్శబ్ద సామూహిక మూల్గుల రొద''
తూర్పు-ఉదయం, పశ్చిమం -సాయంత్రంలా, యవ్వనం మీదుగా వ ద్ధాప్యంకు వెళ్తున్న వేళ ఒకానొక సమయాన వెనక్కి మళ్ళి స్వప్నాన్ని కలగంటున్న వాళ్ళ వైపుకు, ప్రేమలు కరువయి మనుషుల మధ్య పెరిగిన అంతరాలను ఎత్తి చూపుతూ.. ఈ తరుణాన అనురాగాన్ని చూపిస్తూ తడిమే చేతుల వైపుకు, బాధలను, గతాలను సమాధి చేస్తూ కొత్త వర్షాన్ని కురిపిస్తూ లోపలి నుంచి బయటకు కొత్త ఉదయపు కిరణాలను నాటుతున్న ఆశలలోకి, కాలం ఎండుటాకుల్లా రాలుతున్నప్పుడు పచ్చబొట్టులాంటి సంతకం చేస్తూ కాలం వాలిపోతున్న వైపు పయనించాలని కవయిత్రి తన మార్గాన్ని స్పష్టం చేస్తుంది. కదిపి చూస్తే అంతరంగం ఉప్పెనలా ఎగిసిపడు తుంది. గూడు కట్టుకున్న స్తబ్ధతలోంచి నిత్య చైతన్య దీపాల్సి వెలిగిస్తుంది. ''చెట్టు లిపి'' కవితలో అనంత సాక్షాత్కార వీక్షణం దర్శనమిస్తుంది.
''రక్తాన్ని దర్శించిన కళ్ళు/ చీకట్లను తవ్వుతూ వెళ్లి/ ఏదో ఓ చెట్టు కింద జ్ఞానోదయం కోసం/ ధ్యానం చేస్తాయి'' అంటుందామె. జ్ఞానాన్వేషణ జీవిత పరమావధిగా మారినప్పుడు, వర్ణాల జాడని పసిగట్టని ఆదిమ చెట్టు మూలాల్లోకి వెళ్ళినప్పుడు, అంతర్గత ప్రపంచాన్ని తడిమి చూసే లక్షణం కనిపిస్తుంది. ఈ పదునైన లోచూపే విశ్వమానవీయతకు అద్దం పడుతుంది. ఇది మార్గరెట్ విశ్వాసానికి ఒక ఆత్మ పతాక.
సున్నితమైన అంశాన్ని గంభీరంగా చెప్పడం ఆమె కవిత్వంలో ప్రధానంగా కనబడుతుంది. 'రాజ్యమా ఉలికిపడకు'' కవితలో 'నల్లధనం రద్దు' సమయంలో దేశవ్యాప్తంగా సంభవించిన పర్యవసానాలను చాలా వ్యంగ్యంగా ఎండగడుతుంది.''కన్నీళ్లు/ కరెన్సీ నోట్ల ముందు/ మంచుగడ్డలై మౌనం వహిస్తుంటే/ కుబుసం విడిచిన రాజ్యం/ కొత్త నవ్వులు నవ్వుతుంది'' అని చెబుతున్నప్పుడు విముద్రీకరణ ఛాయలు నోట్ల రద్దు సందర్భంలోని కాషాయ వర్ణ పతాకం తీరుతెన్నుల్ని,ఆ నాయకుల నైజాన్ని తెటతెల్లం చేయడానికి వెనుకాడని కలం ఆమెది. అందులో స్పష్టమైన తన రాజకీయ కోణాన్ని ఆవిష్కరించింది.
ఆమె కవిత్వమంతా ఆధునికతను సంతరించుకొని ఉంటుంది. భాషా పరమైన వైవిధ్యం, సృజన ఈ కవయిత్రి అంతర్గత శక్తులు. కొన్ని ఉదాహరణలు చూస్తే..
'కన్నీటి తడిలో ఖాళీతనపు డెన్సిటీ', 'బూడిద లోంచి మొలకెత్తే ఫీనిక్స్ ఆలాపనలు', 'నాలుగు రోడ్ల కూడలిలో రెడ్ సిగల్ లైట్ లా', 'కంప్యూటర్ల తెరపై మనిషి జీవితం/ డబ్బుల పట్టికగా మారిపోతుంది/ దేహం ఎంత ఖరీదైనదో అప్పుడుగానీ అర్థం కాదు/కాలం విలువైనదిగా తెలిసేది అక్కడే', తూకాన్ని చేతిలో పట్టుకు తిరిగే తెల్ల చొక్కాలు/జీవం కన్నా మరణం ఎంత విలువైందో /కౌన్సిలింగ్ చేస్తుంటారు', 'తీరంలో ఎవరో కళ్లు వదలివెళ్లారు', దిగమింగిన బాధల సాక్షిగా దుఃఖపు బావుటా', 'ఊరు మళ్లీ చిగురించాలని/ ఆకాశం బీజం నాటింది', 'నాగలి మోస్తూ తోబుట్టువులైన పశువులు', 'ఇరుకు ఇళ్ల మధ్య/ విశాల హదయాల అల్లిక', 'చెట్టులా మారిన గొంతిప్పుడు/ ప్రపంచ శాంతి కపోతం', 'మౌనం మనసుకు కనబడని కంచె', 'ఆత్మ ఋతువు తొడిగే చిగురు భాష', 'నరికిన నా చేతులిప్పుడు భూమిని చీల్చే ఆయుధాలు', 'ఎండిన నేలలపై మానవ బీజం మొలకెత్తిస్తూ', 'సమయం గుప్పిట నుంచి జారిపోతుంటే', 'ఆకాశాన్ని కళ్లలోకి వొంపేసుకుని', 'కాలం మంచులా కురుస్తున్నపుడు', 'కళ్ల పొరల కింద నిదురించే సూర్యుడు', 'ఈడుస్తున్న కాళ్ల కింద చీలుతున్న నీడ', 'మనిషికి లిపి లేదు', 'తవ్వబడ్డ చేతుల్లో/ కొత్త ఆకాశం', 'అతనిది నక్షత్రంలా వెలిగే ముఖం', 'నీడగా రాలి పోయిన కాలం', వంటి వాక్యాల మెరుపులు ఆమె కవిత్వంలో కోకొల్లలు. కవితాశీర్షికలో ్ల సైతం అదే వైవిధ్యం ఉంటుంది. ఆ శీర్షికలు అక్షర లోకాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తాయి. భాష, శైలి, భావం మూడూ ఎంత సరళంగా ఉంటే అంతగా ఆ కవి/కవయిత్రి పాఠకునికి చేరువ అవుతారు. మెర్సి భాష చాలా సరళం. శైలి స్పష్టం. భావం అంతే స్పష్టంగా ఉంటుంది. ఒక పదచిత్రాన్ని తీసుకుని దాని ద్వారా వస్తువుని సందర్భాన్ని కవిత్వ సారాంశాన్ని ధ్వనింపజేస్తుంది. మెర్సీలో రాజకీయ, సామాజిక అంశాలు కూడా తన స్వభావముద్రలో కనిపిస్తాయి. నిజానికి ఇవి సమకాలీన ప్రభావాలవల్ల తన కవితలో ఒదిగిపోయి ఉంటాయి.
- అనంతోజు మోహన్ కష్ణ