Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగలి జెండా కర్రై
నగర వీధుల్లో నడిచింది
నాగలి భూమిని వదిలి
నగరంలో ఇనుప కంచెలను
దునుమాడింది
నాగలి తూటాలకు
చెదరకుండా గుండె నిబ్బరంతో
నిలబడింది
నాగలి
ఆకలి దప్పిక చలి వాన ఎండలకి
చలించక కడదాకా పాతుకుపోయింది
నాగలి
కరోనా మహమ్మారిని సైతం
లెక్క చేయక లక్ష్యం కోసం
ఊపిరి పోసుకుంది
నాగలి
జల ఫిరంగులకి ఆనకట్టై
నిలిచింది
నాగలి
నియంతత్వ గుండెలకి
నిదుర లేకుండా చీల్చింది
నాగలి
నేటి పోరాట దిక్సూచిగా
మార్గ నిర్దేశం చేసింది
ఎవ్వడైనా
తలొగ్గాల్సిందేనని తేగేసి చెప్పింది
నాగలి
- గిరి ప్రసాద్ చెలమల్లు
9493388201