Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏందీ కలికాలం కాకపోతే...
గిన్ని ఇచిత్రాలా, గిన్ని ఇకమతులా..
అతిగ చెబుతాన్నని అనుకోకు
నాకు మతి తెలిసినప్పటి నుండి
మా అయ్యెప్పుడు అలుగలేదే
మా అయ్యేందే, ఎవ్వలయ్యయినా...
ఆయనకు ఉన్నదేందో, లేనిదేందో
కన్న పోరగాండ్లకు కనిపించకుండా
కంచంల పెట్టుకొచ్చి
ముద్దెన్కముద్ద తింపిచ్చి
ఆనక ఖాళీ మంచిల్తాగి పడుకొనేది
చెంబిస్తిరి చేసినంగిపై టైబెల్టులు కట్టి
మెడలమీదెక్కిచ్చుకొని బడికాడ
దిగెట్టిన
నడీడు నా అయ్య దిగులుతో
వొంగిపోయిండు వొందేళ్ల
ముసలోడిలా
వొచ్చే మాయరోజుల్ల ఇల్లెట్ల
ఎల్లదీయలే
కన్నకడుపునెట్ల కాపాడాలని
తలపోసిండే కానీ
ఖాళీ కంచమ్ముందెట్టి
కచ్చీర్కైతే పోకపోయేది
ఆకాసంల పిట్టకు
మసాలా అస్సలు నూరకపోయేది
అయినా ఆకాశం కూడా
అన్ని బ్రమలే కల్పిత్తాంది
ఓరయ్యా కాలం మాయలపడకు
ఆకాశమొంక సూడకు గాల్లె తేలకు
గద్దె మీద పంట పండదు
భూమిల్నే...భూమిల్నే
ఎంతెత్తుకు ఎగిరినా కలిసేది భూమిల్నే..
- రాపాక శ్రీనివాస్