Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాన్న మాటల మనిషి కాదు చేతల మనిషి అంటూ సాగిన శీర్షిక కవిత నాన్న పట్ల కవయిత్రి అంతర్గత భావనలను తెలుపుతుంది. కత్రిమ మాలలల్లుకున్న సంభాషణలు ముడిపడ్డ దారపు పోగులే అవి కుట్టుపడని జోకొట్టలేని లాలిపాటలే...అంటూ మేకప్ ముఖాలు కవితలో ఉపమానాలు అబివ్యక్తి మనకు నచ్చుతుంది. మానవ సౌందర్యాన్ని .. సంస్కతిని, దేశభక్తిని, తన భావ స్పర్శతో స్పషించారు.
ఆరోజులే నయం తెల్లారక ముందే పల్లె లేచేది తన వారి నందరినీ తట్టి లేపేది అంటూ పల్లె చిత్రాన్ని చిక్కగా అల్లారు. అందాల బందావనం మా భద్రాద్రి కొత్తగూడెం అంటూ తన ప్రాంతాన్ని కవనంలో మనస్పూర్తిగా వర్ణించుకున్నారు. ఆర్.టి.సి ఉద్యోగిగా పలు ప్రాంతాలు తిరిగే అనుభవంకవన అల్లికలో కనిపిస్తుంది.
తెలంగాణ సాహితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 7న భద్రాచలం లయన్స్ క్లబ్ కార్యాలయంలో రెండు కవితా సంపుటాలు సాహిత్య సౌరభాల మధ్య ఆవిష్కరింప బడ్డాయి. ఇందులో ఒకటి సోంపాక సీత రచించిన ''నాన్నా మాట్లాడు'' కాగా మరొకటి తాతోలు దుర్గాచారి రచించిన ''తీరం చేరని కెరటాలు''
ఒకే అంశం రెండి పుస్తకాలు రెండు దక్పథాలుగా వెలువడిన ఈ కవన పొత్తముల గురించి నాలుగు వాక్యాలు ప్రత్యేకంగానే చెప్పుకోవాలి.శ్రీ మల్లి నాధసూరి కళాపీఠం ఏడుపాయల సాహితీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహింపబడిన అంతర్జాల గ్రూపులో సాగిన సాహితీ ప్రయాణ ఫలితమే ఈ సంపుటాలు.నిర్వాహకులు ఇచ్చిన వస్తువుకు స్పందిస్తూ చక్కని శిల్పంతో కవిత్వీకరించారు.తెలవని సాహిత్య విషయాలను తెలుసుకుంటూ ఒక కవన దీక్షా బద్దులై తమ కవిత్వానికి మెరుగులు దిద్దుకుంటూ విభిన్న అంశాలను తమదైన అనుభూతులతో సాహిత్య పుణ్యక్షేత్రం భద్రాచలం నుంచి వెలుగు చూసాయి.
ప్రగతిశీల దక్పధంతో..
ఎంతో కాలంగా ప్రగతిశీల దక్పధంతో కవితల్ని అల్లుతున్న కవయిత్రి సొపాక సీత తన మొదటి ప్రయత్నంగా ''నాన్నా మాట్లాడు'' అనే శీర్షికన సంకలనాన్ని తెచ్చారు. వంద కవితలతో నూరుశాతం విభిన్న వస్తువులకు ప్రాణం పోసారు. అలవోకగా అల్లిన ఈ కవితా సమహారంలో సీత శైలి కొన్ని సందర్బాలలో భిన్నంగా సాగటం పాఠకులను ఆకట్టుకుంటుంది. ఇందులో కవిత్వం పాలు ఎంతుంది అని చూడటంకన్నా ఈ సంకలనంలో నూతన ఒరవడిలో సాగిన పలు అంశాలు.. అభివక్తి నవ్యత, ప్రతీకలు, కొసమెరుపులు రంజింప జేస్తాయి. సమాజమూ సాహిత్యము అనే మొదటి కవిత నుంచి సినారే ఏమిరాసినారే అనే చివరి కవిత వరకూ కవయిత్రి సీత తనదైన బాణిని ఉపయోగించారు. భావోద్వేగంతో రాసిన కొన్ని మెచ్చుతునకలు హదయాన్ని కదిలిస్తాయి. అంశాలు ఎంచుకోవటం కవయిత్రి సొంతం కాక పోవటం వల్ల సంకలనం విభిన్న వస్తు సముదాయంగా వుంది. నాన్న మాటల మనిషి కాదు చేతల మనిషి అంటూ సాగిన శీర్షిక కవిత నాన్న పట్ల కవయిత్రి అంతర్గత భావనలను తెలుపుతుంది. కత్రిమ మాలలల్లుకున్న సంభా షణలు ముడిపడ్డ దారపు పోగులే అవి కుట్టుపడని జోకొట్టలేని లాలిపాటలే... అంటూ మేకప్ ముఖాలు కవితలో ఉపమానాలు అబివ్యక్తి మనకు నచ్చుతుంది. మానవ సౌందర్యాన్ని .. సంస్కతిని, దేశభక్తిని, తన భావ స్పర్శతో స్పషించారు. తన కవితా సంపుతిని తన తల్లి దంద్రులు ముడుంబ రాజ్య లక్షిమి తిరువెంగలాచార్యులకు అంకితమించ్చారు. ఈ ప్రాంతవాసే అయిన కళాకారులు బీరశ్రీనివాసి గీసిన ముఖచిత్రం, సాహితి పెద్దలు మాల్యశ్రీ, దాస్యం లక్షమయ్య, ఆనందాచారి, చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ, అనిశెట్టి రజిత ముందు మాటలు పలువురి అబినందన వాక్యాలు ఈ పుస్తకానికి గీటురాయిగా నిలుస్తాయి.. కవయిత్రికి సాహిత్య మైలురాయిగా మిగులుతుంది.
సామాజిక బాధ్యతగా సాగిన కవిత్వం
ఇక కవి తాతోలు దుర్గాచారి తీరం చేరని కెరటాలు సైతం అవే అంశాలు వస్తువులు అయినప్పటికీ భిన్నమైన దక్పధంతొ కవిత్వ శైలి సాగింది. సాహిత్య అనుభవం వున్న కవి దుర్గాచారి ఇది మూడో పుస్తకంగా వెలువరించారు. 99 కవితలున్న ఈ పుస్తకంలో తన దైన బాణి శైలి కనిపిస్తుంది. సమాజమూ సాహిత్యము అనే మొదటి కవితతో ప్రారంభమై భళిరా కవివరా అనే చివరి కవిత్వంతో కవితలు ముగుస్తాయి. దేశభక్తి, తాత్వికత, ధిక్కారం, జానపద వర్ణనలు సామాజిక స్పహ అద్దుకోని కవితలు జీవం పొందాయి. ఊరికెట్లా పోవాలే అనే కవితలో ఆరోజులే నయం తెల్లారక ముందే పల్లె లేచేది తన వారి నందరినీ తట్టి లేపేది అంటూ పల్లె చిత్రాన్ని చిక్కగా అల్లారు. అందాల బందావనం మా భద్రాద్రి కొత్తగూడెం అంటూ తన ప్రాంతాన్ని కవనంలో మనస్పూర్తిగా వర్ణించుకున్నారు. ఆర్.టి.సి ఉద్యోగిగా పలు ప్రాంతాలు తిరిగే అనుభవం కవన అల్లికలో కనిపిస్తుంది. చక్కని ముఖచిత్రంతో ముందుమాటలతో కవి దుర్గాచారి వెలువరించిన ఈ కవితా సంపుటి తన తల్లిదండ్రులకు అంకితమిచ్చారు.ఈ సంపుటి ఆయనను మరో మైలురాయి వైపు నడిపిస్తొంది.
డా|| కటుకోఝ్వల రమేష్
9949083327