Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆహారమే వ్యవసాయ పరమార్థం
మరి వరి సాగు వద్దంటే ఎలా
నీళ్లు లేక అవుగోలిచ్చిన నేలలో
కళ్ళ నిండుగ చెరువులు నవ్వుతున్నవి
పొలిమేర పొడుగూతా కనిపించే జలావరణం
తెలువదా అసలు
తరి భూముల్లోనే వరి పండిస్తరు
ఆకలిగొన్న వానికి అన్నమే పరబ్రహ్మం
సస్య విప్లవం అంటేనూ విరివిగానే ధాన్యం
నీళ్ల పారకం కలిగితే ఎల్లకాలమూ పరినాట్లే
ఉత్పత్తి అవసరాలు మిగులుబాటు
కొనుగోలు సూత్రాలు మీ వ్యవహారం
అనాదిగా ఆకలి తీర్చడమే మా వ్యాపనం
పొలాల తీరని దాహం కోసమే కదా
నదుల మీద కట్టుకున్న జలాశయాలు
కన్న కలలన్నీ ధాన్యరాశుల కోసమే
మల్ల యాసంగి వద్దు వద్దంటే ఎట్ల?
బియ్యం గింజలే జనజీవన ఆహారం
వరి నారుమడి సంస్కతిక పరంపర
- అన్నవరం దేవేందర్, 9440763479