Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అర్ధ శతాబ్దం పాటు నగరంలో జీవనం గడిపినా ఇవాళ్టికీ నేను పుట్టిన, పెరిగిన పల్లెటూరు మాత్రమే నా జ్ఞాపకాలలో సజీవంగా ఉండి నన్ను కవిగా, మనిషిగా నిలబెడుతున్నది. పల్లె టూరు మాత్రమే నా జ్ఞాపకం, నా కల, నా దుఃఖం, నా సంతోషం. ఇంకా అనేకానేక నా అగణిత భావోద్వేగాలకు నా పల్లెటూరు మాత్రమే కేంద్రం. ఊరు చివరో, మధ్యలోనో, నదీ తీరంలో శీతాకాలంలోనో, వేసవి మధ్యాహ్నం పూటో నిలబడితే సమస్త ప్రపం చమూ నా చూట్టూ వున్నట్టే ఉంటుంది. ఆ ఎత్తైన చెట్ల చివరలకి నేను చేతులు చాస్తాను. నదులు, సముద్రాలూ, పర్వతాలు, భౌగోళిక సరిహద్దులు దాటుకుని ఎగురుతూ వెళ్లే పక్షులు నావి అనిపిస్తాయి. వాటిని నా స్నేహితులుగా భావిస్తూ నన్ను నేను కొత్తగా కనుగొంటాను. అగణితమైన శక్తి లో నేనూ ఒక భాగం అవుతాను''. అంటారు నీలమణి
''ఆధునిక మానవుడు తన ఆత్మ కోసం నిరంతరం అన్వేషిస్తున్నాడు . ఏదో ఒక రోజు అతడు కవిత్వం అనే మాధ్యమం ద్వారా మాత్రమే తన ఆత్మను కనుగొంటాడు . ప్రేమాన్విత లోకం చేరడానికి ఒక సులువైన మార్గం కనుగొంటాడు. అనాదిగా కవిత్వం మానవుడి సుదీర్ఘ విరామాలలో తన ప్రతి ధ్వనినీ ప్రతి ధ్వనిలా వినిపిస్తూనే వున్నది. వినదలచుకున్న ప్రతి మానవుడికి, ఉదయం నుంచి సాయంత్రం వరకు తనలో లోపలి లోకాల నుంచి ప్రవహిస్తున్న సత్య, శాంతి సౌందర్యాల జీవ ధాతువు ఏదో కవిత్వం చేసే ధ్వనిలో వినిపిస్తుంది. కవిత్వం అనేది మానవుడి కంఠధ్వని. మనిషి అంటూ ఒక అస్తిత్వం ఉంటే అతడిలో కచ్చితంగా కవిత్వం ఉంటుంది. ఆ కవిత్వం మనిషిని సమస్త చరాచర జీవరాశితోనూ అనుసంధానిస్తుంది. జీవితంలో ఒక్కసారి కూడా కవిత్వం చదవనివాళ్ళు, రాయని వాళ్లలో కూడా కవిత్వం తన ఉనికిని నిలుపుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే కవిత్వం మానవుడి అంతిమ భాష'' అంటారు నీలమణి ఫ్యూకన్ .
2020వ సంవత్సరానికిగాను జ్ఞానపీఠ పురస్కారం పొందిన నీలమణి ది అస్సామీ సాహిత్యంలో చెరిపేస్తే చెరగని సంతకం. అతడి కవిత్వం దానికి అదే ఒక సాగా ఆఫ్ పోయెట్రీ. అతడి కవిత్వం విస్తతమైనది. అతడి కవిత్వ భాషలో మిథోపోయిక్ లక్షణాలు చాలా కనిపిస్తాయి. అతడి కవిత్వ నిర్మాణంలో ఒక సంగీతం వుంది. అతడి కవిత్వ వస్తువు, జననం నుంచి మరణం దాకా, రాజకీయం నుంచి కాస్మిక శక్తి దాకా స్పశించని అంశం లేదు.
ఎగువ అసోంలోని జోర్హాట్ జిల్లాలో దుర్గోన్ గ్రామంలో 1933 పుట్టిన నీలమణి 1960లో గౌహతీ యూనివర్సిటీ నుంచి చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. 1964 నుంచీ అధ్యాపక వత్తిలో కుదురుకున్న ఆయన 1992లో పదవీ విరమణ చేసారు. నీలమణి ఎంత విస్తతంగా రాశారో అంత విస్తతంగానూ అవార్డులు, రివార్డులు పొందారు. ఆయన చేసిన రచనలను, పొందిన పురస్కారాలను ఒక చోట చేర్చి చూస్తే బయట వాళ్లకు ఎవరి కైనా అద్భుతం అనిపించక మానదు. కానీ ఆయన మాత్రం వినమ్రంగా నోబెల్ బహుమతి గ్రహీత, కవి పాత్రికేయుడు జరోస్లావ్ సెఫర్ట్ మాటలను గుర్తుచేస్తూ ''నేను చేసిందేమీ లేదు. ఈ ప్రపంచంలో ఇప్పటికే ఉన్న కొన్ని లక్షల కవితలకు మరి కొన్ని కలిపాను అంతే'' అంటారు. అంతటితో ఆగకుండా ''నా కవిత్వంలో పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు. అవన్నీ చిమ్మటలు చేసే శబ్దాలు లాంటివే'' అని ముక్తాయిస్తారు.
అసోంలో ఆధునిక కవిత్వం 1940లలోనే ప్రారంభం అయినది. హేమా బారువా, అమూల్య బారువా, మహేశ్వర్ నేవోగ్, బాబానంద దత్తా ఆధునిక కవిత్వానికి ఆద్యులుగా చెప్పుకోవచ్చు. వస్తువు, శిల్పం రెండింటిలో వినూత్న పంధా అవలంబించారు వీళ్ళు. సంప్రదాయాన్నీ, ఆధునికత్వాన్ని కలగలిపి, సామాజిక సంవేదనను గార్నిష్ చేయడం ఈ కవిత్వ లక్షణం. తెలుగులో అభ్యుదయ కవిత్వ ఉద్యమం లాంటిదే ఇది కూడా.
నీలమణి మొదటి కవిత్వ సంపుటి ''సూర్య హేనో నామి ఆహే ఈ నాడీది ఁ(ుష్ట్రవ ూబఅ జశీఎవర ణశీషఅ దీy ుష్ట్రఱర =ఱఙవతీ-1963)లో చెప్పుకోదగిన కవితలే వున్నాయి. నిజానికి ఇది నీలమణి మొదటి కవిత్వ సంపుటి అంటే ఎవరూ నమ్మరు. కానీ తరువాతి సంకలనాలో ఈ కవిత్వం సంకలనంలోని కొన్ని కవితలను పూర్తిగా డిస్‌ఓన్ చేసుకుని పూర్తిగా తన కవిత్వ ప్రపంచంలో నుంచి డిలీట్ చేసేసాడు. ఎందుకలా అంటే ''నేను స్వయం మూల్యాంకనం చేసుకున్నాను'' అన్నారు ఆయన. తెలుగులో ఇలా స్వయం మూల్యాంకనం చేసుకున్నది ఒక్క రంగనాయకమ్మ మాత్రమే. తన రెండవ, మూడవ కవిత్వ సంపుటులు అయిన నిర్జన్తర్ శబ్ద, అరుకిను శబ్ద ( ుష్ట్రవ ూశీబఅస శీట ూఱశ్రీవఅషవ 1965, Aఅస షష్ట్రa్ a ూఱశ్రీవఅషవ 1968)లలో కూడా నిర్మాణ రీత్యా కొంచెం లూస్ ఎండ్స్ ఉన్నప్పటికీ వస్తువు మాత్రం విస్మరించలేనిది. 1972లో వచ్చిన ''ఫులి తోక సూర్యముఖి ఫుల్టర్ ఫలే'' ఁ(ుశీ a ూబఅటశ్రీశీషవతీ ఱఅ దీశ్రీశీశీఎ, 1972) అస్సామీ కవిత్వంలో ఒక ట్రెండ్‌సెట్టర్. పారదర్శకమైన ఊహల స్థానంలో ప్రతీకలు వచ్చి చేరాయి. కవి తాను పొందిన అనుభవాన్ని పాఠకుడికి అందించే క్రమంలో నీలమణి ఒక కొత్త భాషను సష్టించుకున్నాడు. ఉదాహరణకి ఈ కవిత చూడండి
ఆ రోజు ఆదివారం
ఆ రోజు ఆదివారం
కటికవాడి దుకాణం నుండి తాజా నెత్తురు
మురుగు కాలువలోకి వీధిని దాటుకుని వెళుతున్నది
క్రమం తప్పిన జన సమూహం ఆ నెత్తుటి మడుగును
అసలేమాత్రం పట్టించుకోవడం లేదు
రెండు పనికిరాని కుక్కలు మాత్రం తోకలు ముడుచుకుని
గడ్డకటని నెత్తుటి ప్రవాహాన్ని నాలుకతో నాకుతున్నాయి
అశాంతితో నిండిన ఈ ప్రజల మొహాలు
కపాలాల లాగా వున్నాయి
శవాల గదిలో నుండి వినిపించిన మనిషి అరుపు
పావురాల జంట రికామీగా కూర్చున్న టెలిఫోన్ తీగను
కిందకు మీదకు చేసింది
ఆ రోజు ఆది వారం
సంతను నారింజ పళ్ళ వరద ముంచెత్తింది
వాటి అమ్మకం పూర్తి అయ్యేలోగా
మరొక ఆదివారం ముంచుకొచ్చింది
(అస్సామీ నుంచి ఆంగ్లం లోకి కష్ణ దూలాల్ బారువా )
కవిత మొదలుపెట్టినప్పుడు కవి ఎవరిని ఉద్దేశించి కవిత చెపుతన్నాడో అర్ధం కాదు. చివరకు నారింజపళ్ళ ప్రస్తావన వచ్చాక కానీ కవిత ప్రారంభంలో కవి ప్రస్తావించిన కటికవాడు అంటే కరుణ లేని ప్రభుత్వం అని అర్ధం కాదు. తోకలు ముడుచుకుని నెత్తుటిని నాలుకతో స్పశించే రెండు కుక్కలు మన అధికార గణానికి ప్రతీక. రికామీ గా టెలిఫోన్ తీగ మీద కూర్చున్న పావురాల జంట ఏమాత్రం సోషల్ కాన్షస్ నెస్ లేని ప్రజానీకానికి ఉదాహరణ . వాళ్ళు మనుషులు కాదు ఉత్త మానవ కంకాళాలు. శవాల గదిలో నుంచి వచ్చిన అరుపు దేనికి సంకేతం? కవి ఇచ్చిన చివరి స్ట్రోక్ నారింజలు అమ్ముడుపోక ముందే మరొక ఆదివారం ముంచుకువస్తుంది అన్న మాట. కవిత చిన్నదే కానీ ఇచ్చిన దశ్యం , కలిగించిన సంచలనం మాత్రం చాలా పెద్దది
నీలమణి డి ఈ కవిత చూడండి . కవిత్వ నిర్మాణం లో పదచిత్రాలు ఎంపికలో ఎన్నెన్ని కొత్త పుంతలు తొక్కడో అర్ధం అవుతుంది
పర్వత శిఖరాగ్రాల మీద అగ్గి రగులుకున్నప్పుడల్లా
పర్వత శిఖరాగ్రాల మీద అగ్గి రగులుకున్నప్పుడల్లా
నా బాహువుల మధ్య నిన్ను పొదువుకోవాలని గాఢంగా కాంక్షిస్తాను
పునః పునః మళ్ళీ మళ్ళీ జన్మించు
నీ చితి మీద నువ్వుల పువ్వులు ఇంకా వాడిపోలేదు
ఇలా రా ! ఇదుగో చూడు
మూగ శిశువు దుఃఖాశ్రువులలో ఉదయించే సూర్యుడు
ఎలా అభ్యంగన స్నానం చేస్తున్నాడో
ఇదుగో ఇలా రా ! వచ్చి ఈ నాలుగు మాటలు విను
ఎండిపోయిన నది పొడి గొంతుతో
మూగశిశువు ప్రేమాస్పద మొహం తో ఏమి చెపుతున్నదో
(అస్సామీ నుంచి ఆంగ్లం లోకి కష్ణ దూలాల్ బారువా)
మూగ శిశువు దుఃఖాశ్రువులలో సూర్యుడు అభ్యంగన స్నానమా చరించడం, ఎండిపోయిన నది పొడి గొంతుకతో మాటలు రాని శిశువుతో మాట్లాడటం ఈ పదచిత్రాలన్నీ అసోం భౌగోళిక, ప్రాకతిక సౌందర్యానికి పట్టం కడుతూనే, అసోంకి మాత్రమే పరిమితమైన హింస, దుఖాన్ని కూడా ప్రస్ఫూటంగా పరిచయం చేస్తాయి.
కవిత్వం ఇలా వినూత్నంగా రాయ గల శక్తి నీలమణికి ఎక్కడ నుంచి వచ్చింది?
''అర్ధ శతాబ్దం పాటు నగరంలో జీవనం గడిపినా ఇవాళ్టికీ నేను పుట్టిన, పెరిగిన పల్లెటూరు మాత్రమే నా జ్ఞాపకాలలో సజీవంగా ఉండి నన్ను కవిగా, మనిషిగా నిలబెడుతున్నది. పల్లె టూరు మాత్రమే నా జ్ఞాపకం, నా కల, నా దుఃఖం, నా సంతోషం. ఇంకా అనేకానేక నా అగణిత భావోద్వేగాలకు నా పల్లెటూరు మాత్రమే కేంద్రం. ఊరు చివరో, మధ్యలోనో, నదీ తీరంలో శీతాకాలంలోనో, వేసవి మధ్యాహ్నం పూటో నిలబడితే సమస్త ప్రపం చమూ నా చూట్టూ వున్నట్టే ఉంటుంది. ఆ ఎత్తైన చెట్ల చివరలకి నేను చేతులు చాస్తాను. నదులు, సముద్రాలూ, పర్వతాలు, భౌగోళిక సరిహద్దులు దాటుకుని ఎగురుతూ వెళ్లే పక్షులు నావి అనిపిస్తాయి. వాటిని నా స్నేహితులుగా భావిస్తూ నన్ను నేను కొత్తగా కనుగొంటాను. అగణితమైన శక్తి లో నేనూ ఒక భాగం అవుతాను''. అంటారు నీలమణి
అతడు కవిగా రోజుకు రెండు సార్లు తనను తాను దహించుకుంటాడు. మనిషికిగా రోజుకు రెండు సార్లు జన్మిస్తాడు. మనుషులు అంతా కవులు, ప్రేమికులు, తిరుగుబాటు దారులు కావచ్చు అనే నీలమణి ఫ్యూకన్ ను జ్ఞానపీఠం వరించి తనను తానూ గౌరవించుకుంది.
- వంశీకృష్ణ
9573427422