Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దామోదర్ కేవలం రచయిత మాత్రమే కాదు. సాహిత్య కార్యకర్త కూడా. సామాజిక వ్యవస్థలోని అణచివేతకు వ్యతిరేకంగా నిలిచి పనిచేసే ప్రగతిశీల రచయితలతో కలిసి పని చేసి, అందరికీ మార్గదర్శకునిగా మెలిగే వ్యక్తి. సాహిత్య ఎ కాడెమీ సమావేశాలలో ఆయన ప్రసంగాలను విని నేను ఆయనతో పరిచయం చేసుకున్నాను.
2017లో పెన్ దక్షిణ భారతీయ సంఘం ఏర్పడటం కోసం బెంగుళూరులో జరిగిన నాలుగు రోజుల సమావేశంలో దామోదర్ మోజో మరింత సన్నిహిత మిత్రుడయ్యాడు. అనేక విషయాలలో కలిసి పనిచేయగల ఉత్తమ మిత్రుడు దొరికాడని నేనెంతో సంతోషించాను. పెన్ పనుల నిమిత్తం అనేకసార్లు కలిశాము. పూనాలో జరిగిన పెన్ అంతర్జాతీయ సమావేశాలలో కలిసి పాల్గొన్నాము 'పెన్' రచయితల భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించటం కోసం ఏర్పడిన అంతర్జాతీయ రచయితల సంఘం.
ఈ సంవత్సరం జ్ఞానపీర్ అవార్డు పొందిన దామోదర్ మోజోని గోవాలోని సాహిత్యకారులందరూ చాలా ప్రేమగా 'భారు' అని పిలుచుకుంటారు. నిజంగానే వర్తమాన కొంకణి సాహిత్యానికి ఆయనను 'పెద్దన్న' గా చెప్పుకోవచ్చు. అభ్యుదయ భావాలు, ప్రగతి శీలత లక్షణాలుగా కలిగిన ఆయన కథలు, నవలలు సుప్రసిద్ధాలు. ఆయన కథలు అపుడపుడూ 'విపుల' మాసపత్రికలలో నక్షత్రాల వలే మెరవటంతో ఆయన పేరు తొంభయ్యవ దశాబ్దం నుంచే తెలుగు పాఠకులకు పరిచయమైంది. ఆయన కథలు, నవలలు ఇంగ్లీషులోకి అనువాదమైనాయి. 'కథ' న్యూఢిల్లీ ప్రచురణ సంస్థ 2007 మోజో కథలను దీజ్ ఆర్ మై చిల్డ్రన్ అనే పేరుతో ప్రచురించింది. ఆ కథలను భారతీయ పాఠకులు ఇష్టపడ్డారని పునర్ముద్రణలవల్ల తెలిసింది. భారతీయ రచయితగా దామోదర్ మోజో స్థానం ''కార్మెలిన్'' నవలతో మరింత పటిష్టమైంది. ఆ నవలకు 1983లో సాహిత్య ఎకాడమి అవార్డు రావటంతో కొంకణ్ భాషా రచయితలలో ఆయన ప్రతిభావంతుడైన రచయితలని భారతీయ భాషా సాహిత్యానికి తెలిసివచ్చింది. 2004లో ఆ నవల ఆంగ్ల అనువాదాన్ని ఎకాడమి ప్రచురించింది. కార్మెలిన్ ఆ నవలా నాయిక అతి పేద కుటుంబంలో పుట్టి, మరింత పేదరికంలోకి నెట్టబడిన గోవా సహజ ప్రకతిలో నుంచి కువైట్ నగరానికి వెళ్ళటం వెనకున్న సామాజిక ఆర్థిక కారణాలను దామోదర్ అత్యంత వాస్తవికంగా చిత్రించారు. ఆ నిరుపేద యువతి పేదరికంతో సాగించిన యుద్దమే ఈ నవలా ఇతివత్తం. తన జీవితంవలే తన కుమార్తె! జీవితం పేదరికంలో మగ్గకూడదనే నిర్ణయంతో గోవా నుంచి కువైట్ వెళ్ళి ఆర్ధికంగా నిలదొక్కుకుని, కుమార్తెకు మంచి జీవితాన్ని ఇస్తుంది.
చెప్పటానికి సులువుగా అనిపించే ఈ కథను రామోదర్ నవలగా మలచిన తీరు అపూర్వం. సమాజంలో వేళ్ళూనుకున్న లైంగికదోపిడిని ఎదిరించి నిలచిన కార్మెలిన్ తన కుటుంబంలోని అనేక రకాల హింసలను, పీడనలను, అణచి వేతలను ధైర్యంగా ఎదుర్కొన్న కార్మెలిన్ క్రైస్తవ సమాజంలోపల పనిచేసే కుల వివక్షను ఎదిరించిన కార్మెలిన్, పచ్చని పొలాలలో, నీలపు సముద్ర జలాలలో ప్రకతి ఒడిలో పెరిగిన కార్మెలిన్ మనన్ని తన జీవితం వెంట లాక్కుపోతుంది. ఇదంతా ఒక ఎత్తయితే తను పుట్టి పెరిగిన వాతావరణానికి పూర్తి భిన్నంగా ఉండే కువైట్ మహా నగరానికి వలస వెళుతుంది. అక్కడ జీవితంలో ఆటు పోట్లను సమానంగా అనుభవిస్తుంది. కుటుంబభారం దించుకోవటానికి ఆమెకు దొరికిన ఆ ఆధారాన్ని గట్టిగా పట్టుకుని కార్మెలిన్ చేసిన పోరాటాన్ని వాస్తవికతతో రచించారు.
దామోదర్ కేవలం రచయిత మాత్రమే కాదు. సాహిత్య కార్యకర్త కూడా. సామాజిక వ్యవస్థలోని అణచివేతకు వ్యతిరేకంగా నిలిచి పనిచేసే ప్రగతిశీల రచయితలతో కలిసి పని చేసి, అందరికీ మార్గదర్శకునిగా మెలిగే వ్యక్తి. సాహిత్య ఎకాడెమీ సమావేశాలలో ఆయన ప్రసంగాలను విని నేను ఆయనతో పరిచయం చేసుకున్నాను. 2017లో పెన్ దక్షిణ భారతీయ సంఘం ఏర్పడటం కోసం బెంగుళూరులో జరిగిన నాలుగు రోజుల సమావేశంలో దామోదర్ మోజో మరింత సన్నిహిత మిత్రుడయ్యాడు. అనేక విషయాలలో కలిసి పనిచేయగల ఉత్తమ మిత్రుడు దొరికాడని నేనెంతో సంతోషించాను. పెన్ పనుల నిమిత్తం అనేకసార్లు కలిశాము.
పూనాలో జరిగిన పెన్ అంతర్జాతీయ సమావేశాలలో కలిసి పాల్గొన్నాము 'పెన్' రచయితల భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించటం కోసం ఏర్పడిన అంతర్జాతీయ రచయితల సంఘం.
ఆ సంఘం భారతదేశంలో 30వ దశాబ్దంలో రవీంద్రనాధ ఠాగూర్ జవహర్ లాల్ నెహ్రు, మొదలైనవారితో ఏర్పడింది. దక్షిణ భారత అధ్యాయాన్ని ప్రారంభించటంలో దామోదర్ మోజో కీలకపాత్రి పోషించారు. గోవాలో సాహిత్య వాతా వరణంలో ప్రగతిశీల భావాలను ప్రవేశింపజేయటానికి నిరంతరం కషిచేసే దామోదర్ మోజోకు జ్ఞానపీఠ్ పురస్కారం లభించటం భారతదేశంలోని వామపక్ష, ప్రగతిశీల రచయితలందరికీ సంతోషకారకం.
1944లో జన్మించిన దామోదర్ మోజో ఐదు దశాబ్దాలుగా సాగించిన సాహిత్య కషికి లభించిన పురస్కారాన్ని ఆయన ఎంతో వినమ్రంగా స్వీకరిస్తున్నారు. ఆయనను ఈ సందర్భంగా అభినందించటానికి నేను ఫోన్ చేసినపుడు ఆయన ఇది నా ఒక్కడికి వచ్చిన పురస్కారమని నేను అనుకోపటం లేదు. నావంటి రచయితలందరి తరఫున ఈ పురస్కారాన్ని నేను వినమ్రంగా అంగీకరించాను అన్నారు.
తెలుగు నుంచి దామోదర్ నేను రాసిన 'విముక్త' కథా సంపుటిని కొంకణిలోకి అనువదించటం నా అదష్టం. అనువదించటమే కాక ఆ పుస్తకావిష్కరణ సభను ఎంతో గొప్పగా గోవాలో జరిపించారు. గోవా లిటరరీ ఫెస్టివల్లో పాల్గొనే అవకాశం నాకు కల్పించారు. గోవా సాహిత్యకారులకు తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేసే అవకాశం కల్పించారు. అలాంటి ఉత్తమ మిత్రునకు జ్ఞానపీఠ్ వార్డు రావటం వ్యక్తిగతంగా నాకు సంతోషంగా ఉంది .
- ఓల్గా
9849038926