Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొగ జూరిన సూరుకింద
పొర బోతుంటే
మైల బందం
మైలు రాయి లేకుండ పోయింది
వొడిసి పోయిన్రూ
ఇడిసి పోయిన్రూ
నులక మంచం ఎలకల పడ్డది
దిక్కు లేదు
మొక్కు లేదు
ఎక్కిల్ల సప్పుడు లేదు
ఎద మీద ఎట్టాలు పడ్డయి
ఊ కొట్టెటోడు లేకుంటే
ఊరు వొదిలి పెడదామనుకున్నా
పొలిమేర దాటకుండ
బాటకడ్డం పడి
బాస చేసిన బలగం
ఎక్కడికి పోం..
నీ తొపాటే ఇక్కడే
ఉండి పోతమన్నా చేట్లు
ఎడికి పోయిన
ఇడికే వస్తామన్నా పక్షులు
ఎండిన అలుగెల్లిన
గీ కట్ట కిందనే ఉంటానన్నా చెరువు
శ్వాశగ ఉండి పోతనన్నా గాలి
ఋతువులు మందలిచ్చి పోతమన్నాయి
ఎల్లమ్మ ఎండి కండ్లు
ఎలుగుతుంటే....
అన్ని కలిసిన పాట ఒకటి
చివరి దాక నన్ను జో కొడుతనన్నది
- మునాసు వెంకట్, 9948158163