Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా సిన్నప్పుడు వరి నాకెరుకలే
నావి కానీ వడ్లు నాకొద్దనిపించే
గొడ్ల కాడి గడ్డి తో...అప్పుడప్పుడు తింటుండే
ఒలిపిడి...
పాత జొన్నలకు...కొత్త వడ్లు ఇచ్చే
ఊరూరు తిరిగే మారుబేరం షావుకారు
మొదటి నా బేపారి
దంచితే కానీ తినలేని బువ్వను అవ్వ వండకపోయేది
దంచడం కన్న మిల్లు కు పోతే మిల్లు మాయాజాలం తెలువకుండే
తెల్లగున్న జొన్నలకు బదులు బురదలో బువ్వకు పోటి పెట్టినవారెవరో...నాకప్పుడు తెలవకుండే
ఆకలి కి...''అన్న ''మై...కడకు పుట్టిన తమ్ముడి కి...అవ్వ బువ్వైనది
మురికి కంకికి మురిపెమును సూసి ఎవడు ఏడవలే
నీళ్లు ఎక్కువైన మునిగిపోయినా కూడా తినటానికని కొంత ఏసేటేళ్ళు
ఎక్కువ తక్కువైనా... బేపారం చేసి ఎవరూ ఎదగలే
అభిప్రాయాలపు..ఆనందాలలో అందరి ఆరోగ్యం
రోగమయ్యే
బతుకు బండికి...ఆకలికి బువ్వకు వరి అన్నం తెల్ల
సున్నమైనది
వరిని అందరికీ ఊరించి ఉప్పుడు బియ్యం అంటూ లాభానికి లంకే లేపే మిల్లరైన బేపారులు
వరి ఆకలితో పాటు బేపారానికి మూల వస్తువైపాయే
పోషకాహారానికి పొలం తల్లయితే
పొలిటికల్ వాళ్లకు బియ్యం కయ్యమాయే
అవునన్నా కాదన్న పోషకాహార లోపం
వ్యాపారానికి పెద్ద వరం
అదే....గదే అందరూ ఎందుకని అనలేకపోతాండ్రు
గమనిస్తే...మన రాజు తాను కూడా రైతెనంటడు
అలాగే రైతులే బేపారులు అయితరు
మార్కేటింగ్ తెలియని రైతులంతా వరిని వదిలి తమ ఊపిరి ఇడుస్తున్నారు.
- మామిడాల వెంకట్రాజం, 8074668804