Authorization
Mon Jan 19, 2015 06:51 pm
A flower doesnot think of competing to the flower next to it just bloom.
As flowers are the music of the ground from earth lips spoken without sound.
But our leelamma's semanthikalu speak a lot and convey us eternal messages.!
కాంటోన్ సే గిరా రహతా హై చారొన్ taraf సే ఫూల్, ఫిర్ భీ ఖిలా రహతా హై క్యా ఖుష్ మిజాజ్ హై. ఏహ్ నమ్ర్ మిజాజి హై ఫూల్ కుచ్ కహౌ నహీ, వర్నా కభీ దిఖలాయి కాంటోంకో మసల్ కర్.
బంతీ, చేమంతీ మాటాడుకున్నాయి- అనేపాట వినే ఉంటారుగా!
చేమంతి చూట్టానికి నిండుగా అందంగా ఉంటుంది. అనేక రంగుల్లో మనస్సుకు ఆహ్లాదాన్నీ ఉత్సాహాన్నీ ఇస్తుంది. ఈ లీలమ్మ సేమంతికలు కూడా అంతే 63 సేమంతులతో మాలకట్టి తెలుగు భాషమతల్లి మెడలో వేశారు.
సమాజాన్ని తరిచి చూసి, స్పందించే హృదయం ఒంపిన భావాలు వీరి కవితాక్షరాలు. కవితా శక్తిని మించిన శక్తి మరొకటి లేదు. అందుకే భర్తహరి ''సుకవితా యద్యస్తి రాజ్యేనకిం'' అన్నారు.
కవులు పోయినా వారి కావ్యాలు ద్వారా జ్ఞానాన్ని, ఆనందాన్ని మానవ జీవిత పరిణామాన్ని తెలుసు కొంటూ మనల్ని మనం నిరంతర అభివృద్ధి పరుచుకొంటున్నాం. ప్రతి మనిషిలోని వేనవేల సంఘర్షణల ప్రతిచర్యలు వివిధ రూపాలుగా బయటపడుతుం టాయి. అందులో కవిత్వీకరిం చడం ఒకటి. కవి కష్టంలో కష్టంగా సుఖంలో నిండుగా సమసమాజపు ప్రతినిధిగా కవిత్వాన్ని తన ఆయుధంగా ఆభరణముగా మలుచుకుం టాడు.
లీలారెడ్డి కవిత్వంలోని చిక్కదనం, చిక్కీ చిక్కని నర్మగర్భ భావస్పురణం చదువరులను ఆకట్టుకుంటుంది. మొదటి కవిత్వంలోనే ఇలా అంటారు.
''ఒంటరితనం పారిపోయింది
ఒంటరితనపు సమాధిలో ఉండిపోయా
నేనిన్నేళ్ళుగా
కారు చీకటి కాళరాత్రిలో, కన్నీళ్ళ కళేబరాన్నై అప్పుడే సరిగ్గాఅప్పుడే
తను నా వద్దకు వచ్చింది
పక్కన చేరింది
కళ్ళు తుడిచింది
ఒళ్ళు నిమిరింది
మరో చోట ..
''ఓసారి వచ్చిపోవూ అంటు..
నీ కలల వాకిటి చెంత
దోసిలి నిండా పూలతో నిలబడ్డాననే కదా
అలుసు చేసేవు దయలేని ప్రియతమా!
ఆ పూవులన్నీ నా మనసు నిండిన
నీ హావభావ విన్యాసాలేనని అర్థం చేసు కోలేవా?''... అంటారు.
John Keats ode to nightingale లోని వేదన ఈవిడ కవిత్వంలోనూ తొంగిచూస్తోంది.
''పూలూ, బొట్టు గాజులూ
నీ స్వవిషయమని ఎలుగెత్తి
చాటవమ్మా
హే మై స్వీట్ లిటిల్ బ్యూటీ!
నీవో ఆటంబాంబువి
ప్రేమ రసాయనాలన్నీ నీలోనే
వేల విస్ఫోటనాలూ నీలోనే!!'' అంటారు. An extraordinary expression
''దిగులు రాగంలో
తోడు వచ్చినవన్నీ తోడుపెట్టిన పెరుగులా,
గడ్డకట్టిన భావం కుదిపితే చలించే
విచలిత మనస్కనై, లీలగా వ్యథా భరితమై!!''
''నేనూ వర్షమై పోయా
పొద్దున్నే లేచి,
అద్దాన్ని శుభ్రపరుస్తున్నా...
ఇదేమిటి? అద్దంలో భరతమాత ప్రతిబింబం ఎడమ కన్ను ధారాపాతంగా వర్షిస్తుంది. ఎందుకు తల్లీ కన్నీరు అని అడిగానో లేదో రెండో కన్ను కూడా వర్షించసాగింది. నీ చిత్ర పటాన్ని కత్తిరింపులకు గురి చేస్తున్నందుకా అందుకేనా?
అంతేనా... ఎన్నో ఎన్నెన్నో...
నిత్యావసరాల ధరలు నియంత్రణ తప్పిన వేళ ఉప్పు సత్యా గ్రహాలు బ్రాండెడ్ ప్యాకెటైన వేళ
బాల్యం బడి భారాన్ని వీపుపై మోస్తున్న వేళ
కుచ్చెళ్ళలో దాగిన కన్యత్వం వీధి పాలౌతున్న వేళ వార్ధక్యం వృద్ధాశ్రమాన్ని ఆశ్రయించిన వేళ'' అంటూ.. ఆక్రోసిస్తారు.
వీధికో సారాయి దుకాణం మత్తులో జోగుతున్న వేళ తాగుబోతు భార్య కళ్ళలో తడి ఇంకిపోయిన వేళ కులమతాల మర్రి ఊడలు పెకలించలేని అసహాయత కమ్ముకున్న వేళ కుళ్ళిపోతున్న రాజకీయపు అంగాంగాలు శస్త్ర చికిత్సకు లొంగబోమని ప్రతినబూనుతున్న వేళ కళ్ళారా చూస్తూ వర్షించ కుండా ఎలా ఉంటాను బిడ్డా..!! అంటూ నిప్పులు నిండిన ఈ ఆర్ద్రతలో నేనూ వర్షమై పోయా...!
''కమ్మటి కలలాంటి నేస్తమా!
ఎక్కడున్నావు?
ఎక్కడో ఉండే వుంటావులే
ఏ పున్నాగపూల చెట్టుకిందో కవిత్వమై
నా ఊహా గానమై
కానల్లోరాలిన పువ్వు లేరుకుంటూ ఉన్నావటగా
సముద్రం కవిత మహాద్భుతం..!
''సముద్రం ఓ స్త్రీ అంటే నేనస్సలు ఒప్పుకోను
పురుషుడే అంటాన్నేను
ఆహ్లాదం పంచినా, కసిరినా, ముసిరినా,
ఉప్పెనై తనలోనిదంతా బయటకు వెళ్ళగక్కగల
మగాడే తను నిస్సందేహంగా
ఎన్ని ఉసుర్లుతీసినా చెలియలికట్టకు
గండ్లుపెట్టినా తనకే చెల్లింది
అంతా ముగిశాక ప్రశాంతమై పోతాడు
తాను''..
తను సష్టించిన విధ్వంసాలకూ తనకూ సంబంధ మేలేనట్టు సముద్రంలో కలిసిన నదులన్నీ 'స్త్రీ'లే తమ అస్థిత్వాన్ని కోల్పోయి, తేమకన్నీటిపై కూడా స్వతంత్రం లేక సాగరుడే తమ ఉనికన్నట్లు బయట పడే దారిలేక ఇప్పుడు ఒప్పుకోండి సముద్రమంటే పురుషుడేనని!'' చింతన అనే శీర్షికన సాగిన కవిత ద్వారా
ఎన్నో ప్రేమలేఖ
రెప్పచాటు రాగమేదో పలకరించి వెళ్ళాక
మత్తుగాలి వీవనేదో నా మనసు కదిలించాక
పరవశాల రాశిలోంచి అలవోకగా జారిపడిన
ఇది ఎన్నో ప్రేమ లేఖో లెక్క
తేలటంలేదెందుకో..అంటారు.
లీల...! ఎన్నో ప్రేమలేఖ ఏమిటి ప్రేమతో
అంపేవారుంటే. ఘడియ ఘడియకూ
అందుకోమూ...!!
సమాధానం దొరికినట్లేనా?
ఈ మారు అంతరాత్మ నన్నడిగింది
సమాధానం దొరికినట్లేనా? అని
తల అటూ, ఇటూ, ఎటో వైపు ఊపేశా...
దొరికినట్లేనా???
ఫిజిక్స్ కెమిస్ట్రీలా కలిసిపోయిన మన మనసులు
బోటనీ పూలతోటలో పరమళించేనని
వేరే చెప్పాలా ప్రియతమా..అన్న కవితలోని
ప్రేమాస్వాదన
''ఇంకా నీ చుక్కమ్మ కళ్ళలో చుక్కలెట్టుకుని
వెదుకుతూనే ఉంది
ఆమెకేం తెలుసు?
ఉత్తర దిక్కున చుక్కలా నువ్వు వెలుగుతు న్నావనీ!..అని చేసిన సైనిక వందనం...'' మొత్తంపైన సుకుమారమైన సేమంతికలు సువాసనలనే కాదు..బుల్లెట్లు కూడా విసిరాయి.
- రమాదేవి కులకర్ణి, 8985613123