Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా మంది సాహితీ వేత్తలు ఈ శతాబ్దంలో వచ్చిన గొప్ప నవలల్లో ఒకటిగా దీని గూర్చి చెబుతారు. అసలు ఏముందో చూద్దాం అని చెప్పి చదువుదాం అని ప్రారంభించాను. నిజం చెప్పాలంటే మొదట యాభై పేజీల దాకా కొద్దిగా ఓపిక తోనే చదవాలి. గొప్ప క్లాసిక్స్ అని పేరు తెచ్చుకున్న చాలా రచనలుఅలా అనిపిస్తాయి మొదట అదేమిటో.
గాబ్రియేల్ గార్షియా మార్క్వెజ్ పేరుని చాలా మంది చెప్పుకోగా వింటూ ఉంటాము. అలాగే ఆయన గూర్చి అనేక పత్రికల్లో కూడా చదువుతూ ఉంటాము. 1982లో తన సాహితీ కృషికి గాను నోబెల్ బహుమతి పొందాడు ఈ స్పానిష్ రచయిత. మేజికల్ రియలిజం అనగానే చప్పున ఈయన రచనలు గుర్తుకు వస్తాయి. కొలంబియాలోని అరకటకలో 1928లో జన్మించాడు. బొగొటా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి El Espectador అనే కొలంబియన్ న్యూస్ పేపర్‌కి విలేకరిగా పనిచేస్తూ రోం, పారిస్, బార్సిలోనా, కారకస్, న్యూయార్క్‌లలో నివ సించాడు.
కథా, నవలా రచయితగా ప్రసిద్ది చెందాడు. Eyes of a blue dog(1947),Leaf Storm(1955),No one writes in the Colonel(1958),In evil hour (1962),Big Mama's funeral(1962),One hundred years of Solitude(1967),Innocent Erendra and other stories(1972),The Autumn of Patriarch(1975),Chronicle of a death foretold(1981),Love in the time of Cholera 1985) ఇలా అనేక రచనలతో ప్రపంచ సాహిత్యంలో తనదైన ముద్ర వేశాడు.
ఈయన రాసిన అన్ని కధలు, నవలలు తన మాత భాష స్పానిష్‌లోనే రాశాడు. తర్వాత అవి ఆంగ్లంలో కి అనువాదం అయినాయి. One hundred years of Solitude నవలకి ఒక ప్రత్యేకత ఉంది. చాలా మంది సాహితీ వేత్తలు ఈ శతాబ్దంలో వచ్చిన గొప్ప నవలల్లో ఒకటిగా దీని గూర్చి చెబుతారు. అసలు ఏముందో చూద్దాం అని చెప్పి చదువుదాం అని ప్రారంభించాను. నిజం చెప్పాలంటే మొదట యాభైపేజీల దాకా కొద్దిగా ఓపిక తోనే చదవాలి. గొప్ప క్లాసిక్స్ అని పేరు తెచ్చుకున్న చాలా రచనలు అలా అనిపిస్తాయి మొదట అదేమిటో.
Macondo అనే ఊరు. ఆ ఊరు నిర్మాణం గూర్చి మెల్లిగా సాగుతుంది. మొదట అంతా అదే ఆధారంగా నడుస్తుంది.Jose Arcadio Buendia ఇంకా ఆయన భార్య Ursula ఉన్న ఊరుని ఒక కారణంగా విడిచిపెట్టి, బంధువులతో కలిసి చాలా ప్రయాణం చేస్తూ కొండ ప్రాంతంలో ఉన్న ఓ ప్రదేశం బాగుందని చెప్పి అక్కడ ఊరుని కట్టుకోవడం అంటే ఇళ్ళని కట్టుకోవడం ప్రారంభిస్తారు. ఎక్కడో ఉన్న ఈ పల్లె పట్టుకి జిప్సీలు రావడం మొదలు పెడతారు. వీళ్ళు వచ్చినప్పుడల్లా ప్రతి ఏడు కొత్త కొత్త ఆసక్తికరమైన వస్తువుల్ని తీసుకు వస్తుంటారు.
Melquides అనే జిప్సీ Jose Arcadio మంచి మిత్రుడు అవుతాడు. వాళ్ళు అమ్మే అరుదైన నాణేల్ని, లోహ వస్తువుల్ని తనకి ఉన్న మేకల్ని వాటిని ఇచ్చి కొనుగోలు చేస్తుంటాడు Jose. భార్యకి మాత్రం ఇవి ఇష్టం ఉండదు. తన చిన్న ఇంటి లోనే ఒక లేబరెటరిని పెట్టుకుని రరకాల పరిశోధనలు చేస్తుంటాడు Jose. ఒక ఏడు మళ్ళీ వచ్చినపుడు మేగెట్స్‌ని, బూతద్దాల్ని ఇంకో ఏడు వచ్చినపుడు నావికులు ఉపయోగించే కంపాస్‌ని, నక్షత్ర దర్శినిని ఆ జిప్సీ తీసుకొచ్చి ఇస్తాడు, ప్రతిగా భార్యకి వాళ్ళ తండ్రి ఇచ్చిన విలువైన నాణేల్ని Jose జిప్సీకి ఇస్తాడు.ఈ విషయం మీద గొడవలు అవుతుంటాయి.
ఆ ఊరికి వచ్చే జిప్సీలు ప్రతి ఏడాది మారిపోతుంటారు. Melquides కన బడటం లేదేమిటి అని Jose Arcadio అడిగితే లేదు తను చనిపోయాడు అంటారు. అయితే ఆ తర్వాత కన బడినపుడు చాలా బక్కగా కళా విహీనంగా అయి కనిపిస్తాడు, ఎందుకని అలా అయ్యావు అంటే ఒకటా రెండా ఎన్నో దేశాలు తిరిగి తిరిగి అక్కడి లేని పోని రోగాలన్ని సోకి అలా అయ్యాను అంటాడు తను. విచిత్రంగా మళ్ళీ ఏడాది వచ్చినపుడు మాత్రం మంచి యవ్వన వంతునిగా కనిపిస్తాడు. కారణం అడిగితే ఎన్నో మందులు వాడి అలా అయ్యాను అంటాడు.
అలా ఇంచు మించు అరవై పేజీల దాకా ఈ జిప్సీల వ్యవహారాలు నడుస్తుం టాయి.ఈ Macondo ఊరుని Buendia కుటుంబం వారే స్థాపిస్తారు. మెల్లగా అది కొత్త వాళ్ళంతా రావడంతో ఒక పట్టణంగా మారుతుంది. ఈ కుటుంబంలోకి వచ్చే వాళ్ళు రావడం, అలాగే ఊరిలోకి కూడా. అలా గందరగోళంగా మారుతుంది.Jose Arcadio Buendiaనే ఈ గ్రామాన్ని స్థాపించింది అనుకున్నాం గదా.. అసలు వెదుక్కుంటూ ఈ ప్రాంతంకి ఎందుకు వచ్చాడయ్యా అంటే అంతకు ముందు ఉన్న ఊరిలో తమకి ఇంకొకరికి గొడవ అయ్యి అతడిని గొడ్డలి నరికి చంపుతాడు ఈ Jose.. అయితే చచ్చిన వాడి ఆత్మ ఇతడిని తిన్నగా ఉండనివ్వదు, కనబడుతూ చికాకు చేస్తూంటుంది.
ఒకసారి వర్షం వచ్చిన రాత్రి వాడిని చూస్తాడు. ఇక ఇక్కడ లాభం లేదు, మనం వేరే ఊరుని కట్టుకుందాం పదా అంటూ మూటా ముల్లె సర్దుకుని బయలుదేరతారు. భార్య ఉర్సులాకి భర్త చేసే ఈ చేష్టలు నచ్చవు గాని తప్పక అనుసరిస్తుంది. వారితో బాటు కొంతమంది బంధువులు కూడా. అలా అడవులు, గుట్టలు దాటుకుంటూ ఒక అరణ్య ప్రాంతంలో గ్రామాన్ని చిన్నగా నిర్మించుకుంటారు.
అలా ఆ కుటుంబంలో కొత్తగా బిడ్డలు పుట్టడం, వాళ్ళు పెరగడం, దత్తత తీసుకున్న Rebeca అనే అమ్మాయి, మిగతా కొన్ని కుటుంబాలు ఇక్కడకి రావడం వాళ్ళ సాధక బాధలు ఇవన్నీ కలిపితే ఈ నవల అంతే. ఈ గ్రామం సగటు కొలంబియన్ సంస్కతికి రూపులా ఉంటుంది. ఇది 1967 ప్రాంతంలో రాయబడింది.Marquez తమ దేశంలో సంభవించిన అశాంతిని, యుద్ధ వాతావరణాన్ని అంతర్లీనంగా చెబుతాడు. పైకి ఒక కుటుంబం కథలా ఉన్నప్పటికి. ఈ 422 పేజీల నవల నిజం చెప్పాలంటే నా మటుకు నాకు సహనాన్ని పరీక్షించింది. తనుMarquez స్పానిష్‌లో రాశాడు. దానిలో ఏమిటో తెలియదులే గాని, ఈ ఇంగ్లీష్ అనువాదం మటుకు పరమ బోర్‌గా అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రీడబిలిటి తక్కువేనని చెప్పాలి. శైలి కూడా ఎలా ఉంటుందీ అంటే ఏదో ఒక పెద్ద వార్తని పత్రికలో రాసినట్లుగా ఉంటుంది. మొత్తం నవల అంతా ఒక వార్త చదివినట్లుగా, ఒక నివేదిక సమర్పించినట్లుగా ఉంటుంది.
నవలలో ప్రస్తావించబడిన పాత్రలు అన్నీ మరణిస్తూంటాయి. కొన్ని సార్లు మొరటుగా. ఒక మనిషి లాగే ఆ గ్రామం కూడా పుట్టి వంద ఏండ్లు జీవించి మరణిస్తుంది.Jose Arcadioసీనియర్ కూడా మరణం కూడా అసంధిగ్ధంగా ఉంటుంది. ఆకాశం నుంచి పసుపు పూల వర్షం కురిసింది అని అతని పాత్రని ముగిస్తాడు. ఈ నవలలో పాత్రల పేర్లు కూడా కంఫ్యూజ్ చేస్తుంటాయి.ఉదాహరణకిJose Arcadio Buendia భార్య Ursula Iguarian
వీళ్ళిద్దరూ ఈ గ్రామాన్ని స్థాపించిన ఆది దంపతులు. వీళ్ళ సంతానంలో మళ్ళీ ఒకడి పేరు Jose Arcadio మళ్ళీ వీడి కొడుకు పేరు Arcadio. అంతటితో అయిందా ఇలా ఇంకా కొన్ని తగులుతూ గమ్మత్తుగా అనిపిస్తుంటాయి.
ఆ కొలంబియన్ పేర్లు మన సహనాన్ని ఏకాగ్రత ని అలా టెస్ట్ చేస్తుంటాయి. ఇంకో కొడుకు Colonel Aureliano Buendia అదే గ్రామంలో సైనికులచే చంపబడతాడు. అలా ప్రతి పాత్ర ఏదో రకంగా ఒక్కో చాప్టర్‌లో చంపబడుతూ అక్కడి మనుషులు లేకుండా ఆ గ్రామం వల్లకాడుగా మారిపోతుంది చివరకి. హారికేన్ భీభత్సం దానికి తోడు. కొలంబియలోని స్థానిక ఆచారాలను, కథలను, చరిత్ర అంశాలను సమకాలీన అంటే Marquez తన బాల్య జీవిత అనుభవాలు, జ్ఞాపకాలతో ముడివేసి ఈ నవలను నడిపించారు అని చెప్పాలి. లిబరల్స్, కంజర్వేటివ్స్ రెండు వర్గాలు ఏ విధంగా జనాల్ని ప్రభావితం చేశారు ఇలా రాజకీయపరమైన అంశాల్ని కూడా జోడించారు.ఈ నవలలో కొన్ని నచ్చిన లైన్‌లని చెప్పమంటే ఓ రెండు మూడు ఇలా ఉదాహరిస్తాను.
-A Person does not belong to a place until there is someone dead under the ground.
- All human beings have three lives: Public, Private, and Secret.
-It is easier to start a war than to end it.
-The problem in public life is learning to overcome terror; the problem in married life is learning to overcome boredom.
-Children often inherit their madness from their parents
- మూర్తి కెవివిఎస్, 7893541003