Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా కలిసి, భారతదేశ జాతీయ ఉద్యమం ఇతివత్తంపై ఆంగ్లంతో పాటు 22 అధికారిక భాషలలో యువ రచయితల నుంచి పుస్తక రచన ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఇందు కోసం దేశవ్యాప్తంగా అపూర్వమైన స్పందన లభించింది. 23 భాషలలో 16, 000 కంటే ఎక్కువ పుస్తక ప్రతిపాదనలు వచ్చాయి.
భారత జాతీయోద్యమంలో మరుగున పడిన అనేక సంఘటనలు, గుర్తింపుకు నోచుకోని వీరులు, తెలియని ప్రదేశాల పాత్ర, మహిళా నాయకులు మొదలైన అంశాలుగు వాటిలో 22 భాషలలో కధ, వచన రచనా విభాగంలో ప్రతిపాదనలు వచ్చాయి. వాటిలోంచి ఎంపిక చేసిన 75 మంది రచయితల ఫలితాలు ప్రకటించబడ్డాయి.
ఎంపికైన ఈ 75 మందిలో 38 అబ్బాయిలు, 37 మంది అమ్మాయిలు ఉన్నారు. తెలుగు నుండి ముగ్గురు ముప్పై యేండ్లలోపు యువ రచయితలు ఎంపిక చేయబడ్డారు.
1. బోనగిరి సుకన్య, 2. కమ్మరి జ్ఞానేశ్వర్,
3. దేవరకొండ ప్రవీణ్ కుమార్
ఈ ముగ్గురు యువ రచయితలకు ప్రధాన మంత్రి మెంటర్షిప్ కార్యక్రమం కింద ఆరు నెలల పాటు నెలకు రూ. 50,000.00 స్కాలర్ షిప్ లభిస్తుంది. మెంటర్ల పర్యవేక్షణలో ఈ ముగ్గురు రాసిన పుస్తకాలను ఎస్.బి.టి ప్రచురిస్తుంది. తరువాత ఇతర భారతీయ భాషల్లోకి అనువదింపజేస్తుంది. అన్ని ప్రధాన భారతీయ భాషల రచయితలకు ఇందులో స్థానం కల్పించడం వలన ఈ జాతీయ రచయితల మార్గదర్శక పథకం మన భావి రచయితలకు దేశంలోని బహు భాషా కాన్వాస్ పై ఒక విలువైన అంతర్ దుష్టిని అందజేస్తుందని ప్రతేకంగా పేర్కొనాల్సిన అవసరం లేదు. ఒక నిర్దిష్ట భాషకు చెందిన రచయిత కోసం చర్చలు జరపడానికి చాలా చక్కని, విలువైన మార్గం ఇది. ఈ పథకం యువ రచయితల్లో దేశంలోని బహు భాషా స్వరూపం గురించి సరైన అవగాహన, దక్కోణాలతో పాటు భారతదేశపు సంక్లిష్ట వాస్తవికత, దేశ సాంస్కతిక, సాహిత్య వారసత్వాన్ని రూపొందించే బహుళ-ముఖాల కోణాల గురించి మరింత మెరుగైన అవగాహనను అందిస్తుంది.
ఇది గౌరవ ప్రధాన మంత్రి దష్టికి అనుగుణంగా ''ఏక్ భారత్, శ్రేష్ట భారత్'' ఆలోచనను కూడా ముందుకు తీసుకెళ్తుంది. ప్రధాన మంత్రి- యువ- పథకం కింద ప్రచురించబడిన పుస్తకాలు ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువదించబడతాయి కాబట్టి, ఇది నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా 'ఎక: సుతే సకలం' అనే నినాదానికి అనుగుణంగా ఉంటుంది.
భారతదేశ 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని ఆజాదీ కా అమఅత్ మహౌత్సవ్ కార్యక్రమాలలో భాగంగా యువతరం ఆలోచనాపరులను పెంపొందించే జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాజెక్ట్ ను నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా చేపట్టింది.
- యువరాజ్ మాలిక్ డైరక్టర్, నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా