Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె నడిచి వెళ్తుంది
ఇంత అవమానాన్ని
కాసిన్ని వెటకారపు మాటల్ని
చేతబట్టుకుని
బానిసత్వం మూటల్ని తలకెత్తుకుని
పేదరిక ఆకాశం క్రింద
శప్తమయ జీవితంలో
ఏదో తప్పుచేసినట్లు
నిదానించి తలవంచి
నడుస్తూ వెళ్తుంది
స్వేచ్ఛాస్వాంత్య్రాలన్నింటిని
సమానత్వ చట్టాలన్నింటిని
పేదరిక నిర్మూలన పథకాలన్నింటిని
ప్రభుత్వాలు సాధించిన ఘన విజయాలన్నింటిని
హేమంతం పొగమంచు అమాంతం కమ్మేసినట్లుంది
ఆమె నడిచి వెళ్తుంటే ....
నిజమైన నిరుపేదల పై అడుగడుగునా శీతకన్నే..
అభివద్ధి రోడ్డు వెడల్పైతే
అందులో ముప్పావుభాగం కోల్పోయి తిరిగి పూర్వ సహజ ఆకతి పొందలేని ఇల్లువలె పేదరికం
ప్రగతి రఫెల్ లాగా దూసుకెల్తుంటే
పేదరికం వానపాములాగా సాగుతుంది
అందుకే
ఫోర్బ్స్ లిస్టులో భారతీయులు ఎగబాకుతూ ఉన్నా...
క్రొత్త ఇండియన్ బిలియనీర్ల సంఖ్య పెరుగుతూ ఉన్నా....
దేశసంపద కోట్లకు పడగలెత్తుతున్నా
పేదరికం ఎవరెస్టు ఎక్కి రెపరెపలాడుతోంది.
ఆడది అర్థరాతిరి నడిచి వేళ్లాలన్న గాంధీ గారి స్వప్నం
ఇలా క్రొత్తగా నా కళ్లకు బరువుగా సత్యమవుతుంది
ఆమె నడిచి వేళ్తుంటే....
ఎంత దూరం నడిచిన
పేదరికం అంతమయ్యేనా? ఆమె జీవితాన
పేదరికమంటే అష్టమ సముద్రం.
నా దేశాన ఈ పేదరికం
ఎపుడు ఎడబాయునో?
- రమేశ్ నల్లగొండ, 8309452179