నిన్ను నాలో చూడడం, నిన్ను నాలాగే చూడడం, నీ కన్నుల్లో కాంతిని పెంచడం, కలిసి అడుగు వేయడం, ఒకరికొకరం గొడుగు పట్టడం. నువ్వూ నేనూ ఉమ్మడిగా.. నిన్నటి కన్నా ఉన్నతి పొందడం. రానున్న తరాలకు సైతం మిన్నయైన భవిత కు బాధ్యత పడడం ఇదేగా భారతీయ తత్వం ఇదేగా బతుకుకొక అర్ధం. విద్వేషం వినాశ మార్గం సౌహార్ధమే నవ నాగరికతకు అద్దం.
- డా. డి.వి.జి.శంకర రావు, మాజీ ఎంపీ, పార్వతీపురం. 94408 36931.