Sun 02 Jan 22:49:49.863347 2022 వెలుతురుని వెలివేసినట్టుఒక్కసారిగాగది తలుపులన్నీ మూసుకున్నాయి.కళ్లలోని వెలుతురు చుక్కల్నితలదిండు పీల్చుకుంది.సలుపుతున్న నలుపునినలుగు పెడుతూచీకటి నవ్వుతుంది.కనురెప్పల కిటికీలుతెరుచుకున్నాయి.కనుల ముందు శ్యామిక శూన్యం.ఇది ఎవరి కలల రాత్రి?ఎవరు కోరుకునే మైత్రి?గాలి కూడాఊపిరి బిగబట్టిన గంభీర క్షణాలు.భయంతో నడుముముడుచుకున్న దేహంతనను తానే తడుముకుంటుంది.ఆ స్పర్శలోఒక పార్శ్వమురస ప్రసరణమరొకటిజిమరణ ప్రేరణ. - కుడికాల వంశీధర్, 9885201600 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి