Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తీరొక్క పువ్వు.. నానీల సంపుటి ద్వారా సాహిత్యరంగంలోకి అడుగు పెట్టిన గోపాల్ కవిత్వంలో నేటివిటీ రికార్డయింది. తెలంగాణ పల్లె భాష, సంస్కతి, ప్రకతి, సహజ సిద్ధంగా రికార్డయ్యాయి. సిరసనగండ్ల జాతర, కల్వకుర్తి మన్ను, బోనాల పండుగ, అల్లం ఎల్లిపాయ పొట్టు, డప్పుసప్పుళ్ళు, వేపరిల్లలు, ఈదయ్య తాత డప్పు, బొడ్రాయి పండుగ ఇట్లా గ్రామాల్లోని సబ్బండ కులాలు వాళ్ళ సంస్కతి. తినే తిండి, పాడే పాట, ఆడే ఆట అన్నీ కవిత్వీకరించిండు. డిజిటల్ కాలంలో తన విలేజ్ జీవితాలను తన కవిత్వంతో విజువల్ చేశాడు.
నేటి కవిత్వంలో తగుళ్ళ గోపాల్ది ప్రత్యేకమైన గొంతు. ఆ అక్షరాలు మట్టి వాసనలతో జీవితాన్ని పరిమళిస్తుంటాయి. కవిత్వంలోని ప్రతి వాక్యం గ్రామీణ జీవితాల్ని, కుటుంబ సంబంధాల్ని అల్లుకొని ప్రేమను పంచుతాయి. తాను చూసిన, తాను అనుభవించిన జీవితాన్ని వాక్యాలుగా మార్చి కైగట్టాడు. నేడు ఆ కవిత్వాన్నే కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వరించింది. ఇది కలకొండ మట్టికి దక్కిన గౌరవం.
తగుళ్ల ఎల్లమ్మ, కష్ణయ్య దంపతుల కుమారుడు తగుళ్ల గోపాల్ ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్ ప్రాథమి కోన్నత పాఠశాలలో ఉపాధ్యా యుడిగా పనిచేస్తు న్నాడు. ఎంఏ తెలుగు పూర్తి చేసాడు. ''ఎక్కడి నుంచో రేగుపండ్ల వాసన.. వచ్చేది మా హంస అక్కఅయి ఉంటుంది'' అని మంటల్లో చనిపోయిన అక్క హంసమ్మను తన కవిత్వంలో బతికించుకొనే ప్రయత్నం చేశాడు. రాష్ట్ర సాహితీ యువ పుర స్కారం, మహబూబ్ నగర్ సాహితీ అవార్డు, రాయలసీమ సాహితీ పురస్కారం, రొట్టె మాకురేవు సాహితీ అవార్డు అందుకున్నాడు.
మూడు పదులు దాటకుండానే నిండు జీవితపు అనుభవాలను గొంగట్లో పరుచుకున్నాడు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే అతడు 'గంజి' నుంచి గెలుపు పాఠాన్ని, బతుకు పాటను నేర్చుకున్నాడు.
''ఇంకా బడిసంచిని
నెత్తికి తగిలించుకోకముందే
మనిషికి చీము నెత్తురు ఉన్నాయని
ఉద్యమపాఠాల్ని నేర్పింది ఈ ముల్లు''... అంటూ రాయిలాగ బతకడం నేర్చుకున్నాడు.
''ఒకే ఆకాశాన్ని కప్పుకున్నం
ఒకే మట్టిని కప్పుకోవలసిన వాళ్ళం''... అని సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తాడు.
''రైతు ఊపిరి చెట్లకొమ్మలకు వేలాడితే / తోలు చెప్పులసప్పుడే / దేశమంతా / జాతీయగీతమై మారుమోగుతుంది''... అని ధిక్కార పద్యమవుతాడు.
'తీరొక్క పువ్వు.. నానీల సంపుటి ద్వారా సాహిత్యరంగంలోకి అడుగు పెట్టిన గోపాల్ కవిత్వంలో నేటివిటీ రికార్డయింది. తెలంగాణ పల్లె భాష, సంస్కతి, ప్రకతి, సహజ సిద్ధంగా రికార్డయ్యాయి. సిరసనగండ్ల జాతర, కల్వకుర్తి మన్ను, బోనాల పండుగ, అల్లం ఎల్లిపాయ పొట్టు, డప్పుసప్పుళ్ళు, వేపరిల్లలు, ఈదయ్య తాత డప్పు, బొడ్రాయి పండుగ ఇట్లా గ్రామాల్లోని సబ్బండ కులాలు వాళ్ళ సంస్కతి. తినే తిండి, పాడే పాట, ఆడే ఆట అన్నీ కవిత్వీకరించిండు. డిజిటల్ కాలంలో తన విలేజ్ జీవితాలను తన కవిత్వంతో విజువల్ చేశాడు.
- అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417