Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి సంవత్సరం ప్రకృతి బహుమతి
కొత్త కొత్త వైరస్ దిగుమతి
బ్రతుకు పుస్తకాన సరికొత్త వికృతి
జీవితపు బాటలో ఆనందపులోటు
ఆలోచన అలల్లో స్వార్థపు విషకాటు
ఆహారపు అవసరాల అనర్థాల పోటు
మనసు మేనుకు అధిపతి
కాయమే అంతరంగాన్ని అదుపు చేస్తే...
వైపరీత్యమే మిగిలే ఫలశృతి
ప్రకృతి ప్రతియేటా చేసే హెచ్చరిక
వేల మరణ మృదంగ శబ్ద తరంగ ఘోష
దేశాలేవైనా పోయేవి మానవ ప్రాణాలే.
జీవన సరళత మాత్రమే ఇక ఔషధం....
ఆహార సాత్వికత నిలబెట్టుగదా ప్రాణం
స్వార్థపు కత్తితో సమతుల్యత నాశనం
ఎప్పటికైనా అది నీ పాలిట భస్మాసురహస్తం
- డా|| జె. అనురాధ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు