Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తన కాఫీ తనే చేసుకోవాలి కాబట్టి
ఇప్పుడతను వేకువనే లేస్తూ ఉన్నాడు
ఏరోజుకూ ఏ ప్రణాకా లేదు
పేపర్లలో వార్తలను చదువుతునైనా ఉండాలి మామూలికంటే ఎక్కువ సొంతో
రేడియోనైనా వింటూ ఉండాలి
ఇపుడా ఇంట్లో తను ఒక్కడే మరి
ఫోను మోగుతుంది
తక్షణం ఎత్తుతాడు
నా గొంతును గుర్తుపడతాడు
అతని కొడుకుని కదా, ఎదిగిన మనిషిని కూడా
ఒక దూర దేశం నుండి చేస్తుంటాను
దూరం మరింత మరింతగా పెరుగుతూ ఉంది అయినా ఫోను అతని కళ్ళను మెరిపిస్తుంది 'ఎట్లున్నవ్? అంతా బాగేనా?''
ఆయన అంతరాంతరాల్లోంచి ప్రశ్న
అతను నా తండ్రి అయినా
అతనూ ముసలి వాడవుతున్నాడు
ఎక్కడ మొదలు పెట్టాలో నాకు తెలియదు
అతనంటే చాలా ఇష్టమని అయితే నా బతుకు నేను వేరే బతకాలనుకుంటున్నానని చెప్పాలనుంది
ఇంత దూరం నుంచి
అంత పెద్ద మాలనెలా చెప్పాలో తెలియదు నాకు
అట్లా మాట్లాడడం నేనెప్పుడూ నేర్చుకోలేదు
అందుకే రోజూ కొన్ని కొన్ని మాటలు తగ్గిస్తూ వస్తున్నాను ఇప్పుడు మాటలు ఇంకా తగ్గిపోతాయి
తొందర్లోనే మా మాటలు తెగిపోతాయి కూడా
- మూలం : గిల్బర్ట్ కోహ్ అనువాదం :
- ఏనుగు నరసింహారెడ్డి, 89788 69183