Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆదిలో దేశంలో సామాజిక సంస్కరణ, జాతీయోద్యమాలు, నిరక్షరాస్యత నిర్మూలన, బాల్య వివాహల నియంత్రణ, వితంతు పునర్వివాహాలు, అస్పశ్యతా నిర్మూలనలాంటివి పాట రూపంలో తెలుగు సాహిత్యంలో ఉద్యమంగా వచ్చాయని చరిత్ర చెబుతుంది. సామాజిక అవస రమై కొందరు అజ్ఞాతకవులు పాట మొదలు కవిత్వమై కదిలారు. సుస్థిర ఆత్మగౌరవ జీవితానికి కవిత్వపాదులు నెలకొల్పారు. తరువాత కాలంలో తెలుగు కవిత్వం అభ్యుదయం పేర రూపం మార్చుకొంది. ఉద్యమ రూపం మార్చుకొంది. విప్లవాలను కవిత ఒడిలోకి తీసుకుంది.
సాహిత్యంలో తెలుగు కవిత్వానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. తెలుగులో ప్రాచీనత సంతరించుకున్న మౌఖిక రూపం తెలుగు కవిత్వం. భారతదేశంలో సంచారులు, అశ్రిత కులాలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిపోతున్న క్రమంలో ఆయా ప్రాంత ప్రజల కట్టుబాట్లు, సంస్కతి వారి కదలికలతో బాటు వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. భాష వారి కళారూపాల్లో, పాటల్లో జీవన విధానంలో నిబిడికతమై వెలుగొందింది. వారి ద్వారా కవిత్వం మౌకిక రాగమై గాలితో పాటు చెట్ల ఆకుల కదలిక రాగమై ఎప్పటికీ పలుకుతుంటుంది. అక్షర నిర్మాణం వారసత్వంగా చెట్టు బెరడు, ఆకుపై జరిగిందని అందరూ అంగీకరించే విషయమే.
తరతరాల మానవ జీవితంలో తెలుగు సాహిత్యం ఈనేలలో మనిషి మనుగడకు పూర్తి బాధ్యతను పోషించినది. సామాజిక విలువల సాహిత్యం తపించింది. ఇది సత్యం.
20వ శతాబ్ద ఆదిలో దేశంలో సామాజిక సంస్కరణ, జాతీయోద్యమాలు, నిరక్షరాస్యత నిర్మూలన, బాల్య వివాహల నియంత్రణ, వితంతు పునర్వివాహాలు, అస్పశ్యతా నిర్మూలనలాంటివి పాట రూపంలో తెలుగు సాహిత్యంలో ఉద్యమంగా వచ్చాయని చరిత్ర చెబుతుంది. సామాజిక అవస రమై కొందరు అజ్ఞాతకవులు పాట మొదలు కవిత్వమై కదిలారు. సుస్థిర ఆత్మగౌరవ జీవితానికి కవిత్వపాదులు నెలకొల్పారు. తరువాత కాలంలో తెలుగు కవిత్వం అభ్యుదయం పేర రూపం మార్చుకొంది. ఉద్యమ రూపం మార్చుకొంది. విప్లవాలను కవిత ఒడిలోకి తీసుకుంది.
తెలుగులో ఆదికవిత్వాన్ని సజించిన దేశీకవి పాల్కురికి సోమనాధుడు రాసిన సాహిత్యం సంస్కతం, ఆంగ్ల భాషలోనికి అనువాదం జరిగింది. అంతా సంస్కతం నుంచి తెలుగు భాషలోకి అనువాదం చేస్తూ కవులుగా సన్మానాలు పొందిన ఆ కాలంలోనే సోమన, పోతనలు దేశీ భాషకు పట్టం కడుతూ చిరకాల కీర్తిని పొందారు.
మద్రాస్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. మద్రాస్‌లో భాషా వివక్ష, పాలన వివక్షను తట్టుకోలేక ప్రత్యేకరాష్ట్రం కోసం పోరాడారు. దానితో వారు సంతప్తి చెందలేదు. కారణం వారు కోరుకున్నది భాష మాత్రమే కాదు, ఇంకా ఏదో ఉంది. ఆంధ్ర సాహిత్యకారులు కావాలనే తెలంగాణ సాహిత్యాన్ని చర్చకు పెట్టకుండా, వివక్షతో బాటు కొంత నిషేధం కూడా విధించారు. ఆనాటి ప్రభుత్వం తెలంగాణ పౌరులను తెలంగాణ భాషా సాహిత్యాన్ని చిన్న చూపు చూసి, సెకండరి పౌరులుగా చూసిండ్రు. సమైక్యాంధ్రలో రాజకీయ నాయకులు అధములుగా అందలాలను అనుభవించారు. అణిచివేతకు గురైనారు. అగ్రకుల బానిసలుగా మారారు.
1976-2000 కాలంలో సాహిత్యం దళిత చైతన్యాన్ని గుర్తించింది. ఈకాలంలోనే దళితులు క్రమంగా గ్రామాలు వదిలి నగరాలకు నివాసాలను మార్చారు. వారు శుచి శుభ్రతను పాటించటం, నాగరికంగా జీవించడం ఇష్టం లేని వాళ్ళను, అంటరానితనం పాటించడం, అమానవీయ దాడులు చేయటాన్ని, గుళ్లకు ప్రవేశ నిరాకరణ జేసే మతోన్మాదులను, జంతువుల కంటే హీనంగా చూసే దష్టిపై దళిత కవిత్వం విశ్వరూపం దాల్చి తిరుగుబాటు చేసింది. కుల అసమానతలపై దండోరా కవిత్వమై ఉపకులాల ఉపరితలాలను గుర్తించింది. ఈ చైతన్యం ప్రేరణగా సాహిత్యం ప్రాంతీయ అసమానతలు గుర్తించింది. ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత, దాని నిర్మాణానికి పాదులు వేసింది. ప్రశ్నించడం నేర్పింది దళిత కవిత్వం. దాని ప్రతిరూపమే తెలంగాణ సాహిత్య ఉద్యమ పాయలుగా చీలి తిరుగుబాటు సముద్రంగా మారింది. అంతిమంగా ఈ ఉద్యమం జూన్ 2వ తేదీ 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మార్గం చూపింది.
''భాష అందరి సొత్తు. డానికి మేర తెల్వదు. పండిత పామరుల విభజన చేయదు'' అంటూ ''యాస కవితా సంకలనం'' సెప్టెంబర్ 2020లో వచ్చింది. దీనికి గౌరవ సంపాదకులుగా మాదగాని శంకరయ్య, ప్రధాన సంపాదకులుగా శీలం భద్రయ్య నేతత్వం వహించారు. ఇందులో జాతీయస్థాయిలో యాసను ప్రేమించే 84 మంది కవులు యాస గొప్పదనాన్ని వివరిస్తూ కవిత్వాన్ని రాశారు.
''యాసంటే కమ్మనైన అమ్మ...., విచ్చుకున్న ముద్దబంతి, విరబూసిన తంగేడు, పల్లెటూరి పిల్లగాడు, సెలయేటిపై వీచే పిల్లగాలి, కాళోజి కవిత, గోరేటి పాట..'' అంటూ ''యాస'' కవితలో డా|| తండు కష్ణకౌండిన్య యాసకు పట్టుకొమ్మను చెప్పాడు. ఇత్తనం గంప'' కవితలో చిట్ల ప్రేమ కుమార్ ''ఎల్తురు పిట్ట తూర్పు సెట్టు మీద వాలక మునుపే సీపుర్ల ఏక్తారా మోగేది...''అంటూ యాస పరిమళాన్ని అక్షరాలలో పొదిగారు. వేముల ఎల్లయ్య ''తెల్గం తెలంగ'' కవితలో '' తొవ్వ జరుగు జాడలో వినికిడి సైగ సంకేతం... చేతి వెన్నె ముద్ద తొలి తెలంగాణ బాస కుప్పె'' అని భాషాభిమానం ప్రకటించాడు.'' ప్రసిద్ద కవి వేణుసంకోజు రాసిన ''ఈ నేలే మహాబలి'' కవితలో ''రాతి యుగాలను మూగతనాలను సైగల కాలాలను గడిపిన యాతనల నుంచి ....ఈ నేల అనన్య అభినవ సామాన్యుడు నిరంతర పరిశ్రమజీవియే'' అంటాడు. సాగర్ల సత్తయ్య రాసిన కవిత ''నెనరు''లో ''ఎన్కటి నుంచి గూడా తెలంగాణ గడ్డది మాట ముచ్చట్లల్ల, పెట్టి పోతల్లల పావురం గల్ల కన్నతల్లి నెనరు'' అంటాడు. ''యాడుంది'' కవితలో ''నా అధికారిక యాసింకా గొంగళి దశలోనే ఉంది'' అంటాడు చిత్తలూరి సత్యనారాయణ. మదిర సిద్దన్న ''యాసగోస'' కవితలో ''యాసంటే చిన్నతనం గాడు, యాసంటే తెలంగాణ భాషామతం'' అంటాడు. పున్న దామోదర్ రాసిన కవిత ''చైతన్య జ్వాల'' కవితలో ''గ్రాన్దీక పొరల మాటున ప్రామాణిక పాదం చీల్చి, ఉవ్వెత్తున ఎగసిన కెరటం గాదె యాస'' అంటాడు. ''మన భాష- మన యాస'' సహస్రపేజీల పదకోశాన్ని వెలువరించిన ఆదిలాబాద్ కవి కీ.శే. మడిపల్లి భద్రయ్య కవిత ''ఇగ మీ ఇష్టం''లో ''ఓ.. మా రాజ్జం మాకచ్చిందని ఎగిర్నం, దుంకినం, అయ్పాయే. అన్ములొడ్సినై, ఇంకేమో ఒడ్సినట్ల, లొటపెట పద్యాలకెర్జూసినట్లైపాయె, బత్కు థూ...'' అంటూ తన అసంతప్తిని బాహాటంగా చెప్పాడు. ''యాది'' శీర్షికతో కవిత రాసిన శీలం భద్రయ్య ''ఆకిలూడ్సేటపుడు అమ్మ చేతిలో యాస, జోడెద్దుల మెడలో కట్టిన గంటల పల్లవి యాస, శ్రామిక గళాల మధురగానాలు యాస'' అంటూ పల్లె నేటివిటి యాసను పలికించాడు. ఇదే కవితలో పెత్తం దార్ల, వలస వాదుల ఇనుపపాదాల కింద నలిగిపోయిన ''రాయ బడని కవుల సిరాలో యాసను'' పేర్కొన్నాడు.''బంధాల మర్సి రందిల తిరుగుతున్నం'' అంటూ బాధల జీవితాలను వెలిశాల నాగమోహన్ ''ఇంపైన బాల్యపు యాస''లో రాశాడు. ''జానపదములందు జాలు వారెడి యాస'' అంటూ ఊట ఖండకావ్య పద్యకవి డా|| లింగనబోయిన లేఖానందస్వామి యాసలోని గొప్పదనాన్ని ఆటవెలదుల కవిత్వంగా రాశాడు. ఆచార్య యం.రామనాథం నాయుడు మైసూరు నుంచి ''తెలంగాణ ఉద్యమం-యాస'' గొప్ప దనాన్ని కవిత్వంలో స్మరించాడు.''మూగబోయిన గొంతునడుగు మాటకు మించిన రాగం ఏంటో'' అని యాస తొక్కిన గొంతులను అడిగితే ఆ బాధ తెలుస్తుందని శ్రీమతి పాలడుగు సరోజినీ దేవి తన కవిత ''మాధుర్యం''లో చెబుతుంది. మాదగాని శంకరయ్య రాసిన కవిత ''అమ్మ''లో ''తల్లి వేరును తనివితీరా తడిమిచూడు'' అని యాస మర్సిన బతుకులకు యాస తత్వాన్ని చెబుతాడు. ''మన యాసే మన బతుకు, మన యాసే మన సంస్కతి'' అంటూ డా|| వి. జయప్రకాశ్ ''ఆత్మన్యూనత వదులుకుందాం'' అనే కవితలో యాసగొప్పదనాన్ని చెబుతాడు. ఇలా ఈ పుస్తకంలో యాస గొప్పదనాన్ని 84 మంది కవులు తమదైన గొంతుతో బలంగా విన్పించారు.
తెలుగు సాహితీ లోకంలో తెలంగాణ నుండి ''యాస కవుల'' రంగప్రవేశం ఒక సంచలనం. తెలంగాణ రాష్ట్ర పాలన ప్రారంభం కాకముందే, దళారీ సాహితీకారులు రవీంద్ర భారతిని, సాహితీ వేదికలను ఆక్రమించారు. ఆంధ్ర సాహితీ కారులను గేట్ వెలుపల నిలబెడితేనే నాటి తెలంగాణ భాషావమానం పొందినవారి ఆత్మలు శాంతిస్తాయి. ప్రపంచ తెలుగు మహాసభల అనంతరం వచ్చిన ''యాస కవితా సంకలనం'' ఆదిగా ఇక్కడి యాసకు వెలుగులు పరిచే బాట ఆరంభమైనదని అర్ధమవుతుంది. ఈ యాస కవిత ప్రేరణగా ఇకపై కవిత్వం భాషా నిర్మాణం కోసం ప్రశ్నించే కవిత్వమై వెలుగొందుతుందని ఆశిద్దాం.
- వేముల ఎల్లయ్య, 9440002659