Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నింగి చుక్కలు నేలకు దిగొచ్చి
ముంగిట్లో ఆడుకుంటున్న వేళ
పచ్చని వాకిళ్లు హరివిల్లులై
విరిసిన వేళ...
ఆడపడుచుల మనస్సు మురిసిన వేళ
అది ఓ రంగవల్లికగా
రూపాంతరం చెంది
వర్ణ శోభితమవుతుంది
పల్లె పట్నం తేడా లేకుండా
అందమంతా ...
చిత్రించిన ముగ్గులోనే
ఒదిగినట్టు
పరవశించి పోతుంది
అమ్మాయిల సజనకు
వాకిలి అద్దం పడుతుంది
నాకైతే వాళ్ళు చేతి వేళ్లను
కుంచెగా మలిచిన
చిత్రకారిణుల్లా కనిపిస్తున్నారు
ముగ్గంటే అదో సరదా మాత్రమే కాదు
మన సంస్కతికి పూచిన సంప్రదాయం
అమ్మ వేసే సంక్రాంతి చుక్కల ముగ్గుకు
వాకిళ్ల హద్దులు చెరిగిపోయేవి
ఎన్నో చిత్రాలు ఆమె చేతి వేళ్లకు
చిక్కి ధన్యమయ్యేవి ...
ఆమె వేసే రథం ముగ్గు
చూసి తీరాల్సిందే...
ఆ వేళ్ల మధ్యలో నుండి జాలువారే
తెల్లని సుద్ద
సరళ రేఖలు వక్ర రేఖల
రేఖా గణితాన్ని
ఆవిష్కరించేది
ముగ్గంటే కేవలం ముగ్గు కాదు
అదీ ...
సంస్కతీ చైతన్యాల ఐశ్వర్యం....!
- తుపాకుల కష్ణా చారి, 9959404989